ప్రస్తుతం వయోలెన్స్, గన్స్, యాక్షన్ ఇలాంటి నేపథ్యంలో ఎక్కువగా సినిమాలు వస్తున్నాయి. క్లీన్ ఎంటర్‌టైనర్ చిత్రాలు రావడం అరుదుగా మారింది. మనమంతా ఎమోషనల్‌గా మొద్దుబారిపోయాం. ఇలాంటి సమయంలో ‘హాయ్ నాన్న’ లాంటి సినిమా చాలా అవసరం. ఇందులో డబుల్ మీనింగ్ డైలాగులు లేవు, హింసలేదు. చాలా క్లీన్ ఎమోషన్ ఫ్యామిలీ చిత్రమిది’ అన్నారు దర్శకుడు శౌర్యువ్. ఆయన దర్శకత్వంలో నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘హాయ్ నాన్న’. బేబీ కియారా ఖన్నా కీలక పాత్ర పోషించింది. డిసెంబర్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో డైర్టెర్ శౌర్యువ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
► మాది వైజాగ్.నాకు ఎలాంటి సినిమా నేపథ్యం లేదు. ఇంట్లో వాళ్ళు మెడిసిన్ చేయమని చెప్పారు. అయితే సినిమాలపై ఇష్టంతో పరిశ్రమలోకి రావడం జరిగింది. కన్నడ, తెలుగు సినిమా జాగ్వార్, అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్యవర్మ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశాను.
►నాలుగేళ్ల క్రితం ఈ కథ రాసుకున్నాను. వైర ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్స్ కి చెప్పినపుడు వారికి నచ్చింది. నాని గారికి పరిచయం చేశారు. నాని గారికి చెప్పినపుడు ఆయనకు చాలా నచ్చింది. వెంటనే చేస్తానని చెప్పారు. ఆరునెలల పాటు ప్రీప్రొడక్షన్ వర్క్ జరిగింది. తర్వాత షూటింగ్ మొదలుపెట్టాం.
►నా ప్రధాన బలం ఎమోషన్. తండ్రి కూతురు మధ్య అనుబంధం, అలానే మృణాల్ పాత్రలో వున్న బాండింగ్, అలాగే ఈ కథ అంతా దేనిపై ఆధారపడి వెళుతుందనేది కోర్ స్ట్రెంత్. ఆ ఎమోషన్ కారణంగా నాని గారు ఈ కథని ఒప్పుకున్నారని భావిస్తున్నాను.
►హీరో విక్రమ్ గారి అబ్బాయి ద్రువ్ నా ఫ్రెండ్. తన సంగీతం తెలుసు. పాటలు చక్కగా పాడుతాడు, మంచి గిటార్ ప్లేయర్. అందుకే ఓడియమ్మ పాటను ద్రువ్ తో పాడిస్తే బావుంటుందనిపించింది. ఈ ఆలోచన ద్రువ్ కి కూడా చాలా నచ్చి స్వయంగా పాడారు.
►ఈ కథ రాస్తున్నప్పుడే హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్‌ని తీసుకోవాలనుకున్నాను. మృణాల్ నటించిన తుపాన్ సినిమా చూశాను. అందులో ఆమె నటన చాలా నచ్చింది. హాయ్ నాన్న లో హీరోయిన్ పాత్రలో చాలా లేయర్స్ ఉంటాయి. ఇందులో ఏడ్చే సన్నివేశాలు చాలా ఉన్నాయి. అలా ఏడిస్తే కూడా ఎవరు అందంగా కనిపిస్తారని అలోచిస్తున్నప్పుడు నాకు మృణాల్ ఠాకూర్ కనిపించింది.
►బేబీ కియారా సూపర్ ట్యాలెంటెడ్. చిన్నపిల్లలతో నటింపజేయడం కొంచెం కష్టమైనపనే. ఐతే తను నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. సీన్ గురించి చెప్పి డైలాగు పేపర్ ఇవ్వగానే ఎలాంటి తడబాటు లేకుండా ఎమోషన్ ని అర్ధం చేసుకొని నటించేది. ఇప్పటికీ నిద్రలో లేపి అడిగిన తన డైలాగులన్నీ అనర్గళంగా చెప్పేస్తుంది. తనతోయాక్ట్ చేయించడానికి నేను పెద్దగా కష్టపడలేదు.
►ఇందులో శ్రుతి హాసన్ గారికి పాత్రకు ఉండాల్సిన ప్రాధాన్యత వుంది. ఇప్పటివరకైతే ఆ పాత్ర గురించి ఇంత మాత్రమే చెప్పాలి. ఒకటిరెండు సర్ప్రైజ్ పాత్రలు ఉంటాయి.
►‘హాయ్ నాన్న’లాంటి కథ చేయడం ఒక సవాల్. చాలా సున్నితమైన కథ. దానిని మాటలతో, సన్నివేశాలతో ఎమోషన్స్ తో నిలబెట్టాలి. థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలి. ఇలాంటి కథను రాయడం ఒక సవాల్
► ఈ సినిమా విడుదలైన తర్వాత కొంత సమయం తీసుకొని కొత్త సినిమా గురించి ఆలోచిస్తాను. ఇప్పటికే కొన్ని కథలను రాసుకున్నా. నా బలం ఎమోషన్. కమర్షియల్ సినిమాల్లో కూడా ఎమోషనే కీలకం
Comments
Please login to add a commentAdd a comment