టాలీవుడ్ హీరో నాని- మృణాల్ ఠాకూర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం హాయ్ నాన్న... డిసెంబర్ 7న ఈ చిత్రం విడుదులకు రెడీగా ఉంది. నూతన దర్శకుడు శౌర్యువ్ ఈ మూవీని తెరకెక్కించాడు. ఇందులో బేబీ కియారా, శ్రుతిహాసన్, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం విశాఖపట్నంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తాజాగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భారీగా అభిమానులు పాల్గొన్నారు. విశాఖపట్నం ప్రజలతో తనకు ప్రత్యేక బంధం ఉందని వేదక మీద నాని తెలిపాడు. తన యాక్షన్ చిత్రాలు మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే సీడెడ్‌లో పెద్ద హిట్ అయ్యాయని చెప్పాడు. సినిమాల నేపథ్యం ఏదైనా అన్ని చిత్రాలు వైజాగ్‌లో బ్రహ్మాండంగా ఆడాయని తెలిపాడు. జనవరిలానే డిసెంబరు కూడా సినిమాల పండగ నెలగా మారిందని నాని పేర్కొన్నాడు.
హాయ్ నాన్న ఈవెంట్ అంతా బాగానే ఉంది కానీ నిర్వాహకుల అత్యుత్సాహం వల్ల చేసిన ఒక పొరపాటు సోషల్ మీడియాలో పెద్ద దుమారానికి దారి తీసింది. స్క్రీన్‌పై కొందరి సెలబ్రిటీ జంటల ఫోటోలు చూపిస్తూ.. మూవీ టీమ్‌ను ప్రశ్నలు అడుగుతూ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్న సమయంలో తెరపై ఒక్కసారిగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు పూల్‌లో సేదతీరుతున్న ఫోటోలు చూపించారు. దీంతో ఆ ఈవెంట్‌లోని వారందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. కొంత సమయం సైలెంట్ అయ్యారు. విజయ్, రష్మికలు వేర్వేరుగా ఒకే లొకేషన్‌లో ఉన్న ఫోటోలను ఒకేచోటకు చేర్చి దానికి ఒక కొటేషన్ చెప్పాలంటూ యాంకర్ సుమ అడుగుతుంది.
ఎవరూ ఊహించన విధంగా ఈ సంఘటన జరగడంతో హీరో నాని కూడా చిరు నవ్వుతో సరిపెట్టేశాడు. మృణాల్ ఠాకూర్ ఇదేమిటి..? అంటూ ఆశ్చర్యపోయింది. కానీ యాంకర్ సుమ మాత్రం కొంతమేరకు నాలుగు మాటలు చెప్పి డైవర్ట్ చేసే ప్రయత్నం చేసింది. కానీ విజయ్ ఫ్యాన్స్ మాత్రం హాయ్ నాన్న ఈవెంట్ ఆర్గనైజర్స్ పై ఫైర్ అవుతున్నారు. మీకు ఏ అధికారం ఉందని వారిద్దరి ఫోటోలు అలా పక్కపక్కనే ఉంచుతారు.. వారిద్దిరూ ప్రేమలో ఉన్నారని రూమర్స్ మాత్రమే వచ్చాయి... అధికారికంగా వారు చెప్పలేదు కదా అంటూ సీరియస్ అవుతున్నారు. లక్షల మంది చూసే ఒక కార్యక్రంలో భాద్యత లేకుండా ఇంతలా దిగజారిపోతారా..? అని ప్రశ్నిస్తున్నారు.
Cheap promotional stunts from HiNanna Team
— THE CHANTI (@chanticomrade_) November 29, 2023
Fans emo hero ni Personal ga Tag chesi Abuse cheyadam
Hero emo Ma #VijayDeverakonda and #RashmikaMandanna personal life ni Events lo use cheyadam
Endhuku ra babu e cheap stunts
collections ravali ante ma hero personal life lagadam pic.twitter.com/GIDfGRtENy
Comments
Please login to add a commentAdd a comment