విజయ్‌ దేవరకొండ,రష్మికలకు సారీ చెప్పిన నాని | Nani Apologizes To Vijay Devarakonda And Rashmika | Sakshi
Sakshi News home page

విజయ్‌ దేవరకొండ,రష్మికలకు సారీ చెప్పిన నాని

Published Mon, Dec 4 2023 8:04 AM | Last Updated on Mon, Dec 4 2023 8:56 AM

Nani Apologize To Vijay Devarakonda And Rashmika - Sakshi

 నాని  హీరోగా నూతన దర్శకుడు శౌర్యువ్‌ తెరకెక్కించిన చిత్రం 'హాయ్‌ నాన్న'. ఇందులో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. బేబీ కియారా, శ్రుతిహాసన్‌, ప్రియదర్శి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలలో  పోషించారు. డిసెంబరు 7న సినిమా విడుదల కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్‌ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం చిత్ర బృందం విశాఖపట్నంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే.

ఆ సమయంలో హాయ్‌ నాన్న నిర్వాహకుల అత్యుత్సాహం వల్ల చేసిన ఒక పొరపాటు సోషల్ మీడియాలో పెద్ద దుమారానికి దారి తీసింది. విశాఖలో జరిగిన ఆ ఈవెంట్‌లో స్క్రీన్‌పై కొందరి సెలబ్రిటీ జంటల ఫోటోలు చూపిస్తూ.. మూవీ టీమ్‌ను ప్రశ్నలు అడుగుతూ మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తున్న సమయంలో తెరపై ఒక్కసారిగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు పూల్‌లో సేదతీరుతున్న ఫోటోలు చూపించారు. ఏ సంబంధం లేకుండా ప్రత్యేకంగా వారిద్దిరి ఫోటోలు ఎందుకు చూపారు..? అంటూ నెటిజన్లు ఫైర్‌ అయ్యారు. చీప్‌ ప్రమోషన్స్‌ అవసరమా అని దుయ్యబట్టారు.

ఇదే విషయంపై హీరో  నాని తాజాగా ఇలా స్పందించారు. ' విశాఖలో జరిగిన ఆ సంఘటన దురదృష్టకరం.. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో నటుడు విజయ్‌ దేవరకొండ, నటి రష్మికకు సంబంధించిన ఫొటోలను స్క్రీన్‌పై వేయడం నిజంగా దురదృష్టకరం. నిజం చెప్పాలంటే ఒక్కసారిగా ఆ ఫొటో చూసి మేము కూడా ఆశ్చర్యపోయాం. విజయ్‌ దేవరకొండ, రష్మికతో సహా మేమంతా  మంచి స్నేహితులం. ఒక్కోసారి సినిమా ప్రమోషన్స్‌లో అనుకోకుండా ఇలాంటి సంఘటనలు జరుగుతాయని వాళ్లకు తెలుసు. ఈ ఫోటో వివాదం వల్ల ఎవరైనా ఇబ్బందిపడి ఉంటే నాతో పాటు హాయ్‌ నాన్న సినిమా యూనిట్‌ మొత్తం నుంచి సారీ చెబుతున్నాం.' అని నాని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement