
తెలుగు హీరోల మధ్య ఎలాంటి అనుబంధం ఉంటుందో బయటకు తెలియకపోవచ్చు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్ వార్స్ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. గతంలో మహేశ్- పవన్ (Pawan Kalyan) అభిమానుల మధ్య ఇలాంటి హంగామా ఎక్కువగా నడిచేది. కానీ ప్రస్తుతం నాని- విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఫ్యాన్స్ మధ్య ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది.
(ఇదీ చదవండి: ఈ రైతుబిడ్డ పెద్ద వెధవ, బికారిలా అడుక్కుని ఇప్పుడేమో..: అన్వేష్ ఫైర్)
కొత్త మూవీ పోస్టర్ వచ్చినప్పుడో.. టీజర్ లేదా ట్రైలర్ రిలీజైనప్పుడో.. ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ లైక్స్, మిలియన్ వ్యూస్.. మా హీరోకి ఎక్కువచ్చాయంటే మా హీరోకి ఎక్కువొచ్చాయని విమర్శలు చేసుకుంటూ ఉంటారు. కానీ సదరు హీరోలు మాత్రం ఇలాంటివేం పట్టించుకోరేమో అనిపిస్తుంది.
ఎందుకంటే విజయ్ దేవరకొండ-నాని (Nani) కలిసి నటించిన 'ఎవడే సుబ్రహ్మణ్యం'.. మార్చి 21న రీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా టీమ్ అంతా మరోసారి కలిశారు. అప్పటి జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుని పార్టీ చేసుకున్నారు. ఇందులో నానిని హగ్ చేసుకున్న విజయ్ దేవరకొండ.. తనెంటో ఎంత ఇష్టమో కూడా చెప్పాడు. ఇవన్నీ చూసైనా సరే అభిమానుల్లో మార్పు వస్తుందేమో చూడాలి?
(ఇదీ చదవండి: గత సినిమాలు డిజాస్టర్స్.. అయినా పూరీకి మరో ఛాన్స్?)
Caught up with my favourite people to celebrate a special film. #YevadeSubramanyam ♥️@TheDeverakonda @nagashwin7 @SwapnaDuttCh #PriyankaDutt #MalvikaNair @riturv @radhanmusic @VyjayanthiFilms @SwapnaCinema
March 21st- inkokkasaari :) pic.twitter.com/KpNAHHT6oI— Nani (@NameisNani) March 16, 2025
Comments
Please login to add a commentAdd a comment