Hi Nanna In OTT: ఓటీటీలోకి 'హాయ్ నాన్న'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ | Nani And Mrunal Thakur Hi Nanna Movie OTT Release Date Confirmed, Check Streaming Platform Details - Sakshi
Sakshi News home page

Hi Nanna OTT Release Date: నాని 'హాయ్ నాన్న' ఓటీటీ రిలీజ్.. అనుకున్న టైమ్ కంటే ముందే

Published Fri, Dec 29 2023 11:38 AM | Last Updated on Sat, Dec 30 2023 12:02 PM

Nani Hi Nanna Movie Ott Release Date January 5th Netflix - Sakshi

డిసెంబరులో వచ్చిన హిట్ సినిమాలు అంటే చాలామంది 'సలార్', 'యానిమల్' పేర్లు చెప్తారు. అయితే ఇదే నెలలో నేచురల్ స్టార్ నాని కూడా ఓ క్లాస్ మూవీతో వచ్చాడు. హిట్ కొట్టేశాడు. ఇప్పటికీ థియేటర్లలో అలరిస్తున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఇప్పుడు ఫిక్స్ చేసుకుంది. అనుకున్న టైమ్ కంటే ముందే స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయిపోయింది.

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

కొత్త దర్శకులతో ప్రయోగాలు చేస్తున్న నాని.. ఈ ఏడాది మార్చిలో 'దసరా' అనే మాస్ సినిమాతో వచ్చి సక్సెస్ అందుకున్నాడు. ఈ మధ్య 'హాయ్ నాన్న' అనే తండ్రి-కూతురు సెంటిమెంట్ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. తొలుత ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఎక్కువరోజులు నిలబడటం కష్టమని అన్నారు. కానీ 20 రోజులు దాటిపోయినా సరే ఇప్పటికీ థియేటర్లలో ఈ సినిమా రన్ అవుతూనే ఉంది.

ఇకపోతే థియేటర్లలో 'హాయ్ నాన్న' ఇంకా ఆడుతుండగానే ఓటీటీ రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. నెట్‌ఫ్లిక్స్ లో జనవరి 4 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. తొలుత ఈ చిత్రాన్ని సంక్రాంతి తర్వాత అంటే జనవరి 19 లేదా 26వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ మరీ ఆలస్యం అవుతుందనో ఏమో ఇప్పుడు డేట్ ముందుకు మార్చినట్లు అనిపిస్తుంది. 

(ఇదీ చదవండి: Bubblegum Review: 'బబుల్ గమ్' సినిమా రివ్యూ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement