ఈ మధ్య లవ్‌స్టోరీ, యాక్షన్ సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. ఈ క్రమంలో సినీప్రియులకు మంచి ఎమోషనల్ టచ్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది హాయ్ నాన్న మూవీ. నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమాలో బేబి కియారా ఖన్నా కీలక పాత్రలో నటించింది. మోహన్ చెరుకూరి, డా.విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. దీంతో ఈ సినిమా ఓటీటీ హక్కుల గురించి ఆరా తీస్తున్నారు అభిమానులు. ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సుమారు రూ.37 కోట్లు పెట్టి నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను చేజిక్కించుకున్నట్లు సమాచారం. ఈ సినిమాను ఇప్పుడప్పుడే ఓటీటీలోకి తీసుకుచ్చే ఆలోచనలు చేయడం లేదట! వచ్చే ఏడాది సంక్రాంతి సమయంలోనే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేస్తారట!
హాయ్ నాన్న కథేంటంటే..
ముంబైకి చెందిన విరాజ్(నాని) ఓ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్. అతడికి తన కూతురు మహి(బేబి కియారా ఖన్నా) అంటే ప్రాణం. పుట్టుకతోనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న మహికి అన్నీ తానై చూసుకుంటాడు. విరాజ్ ప్రతిరోజు హీరో కథలు చెప్పడం.. ఆ హీరో పాత్రను నాన్నతో పోల్చుకోవడం మహికి అలవాటు. ఓ రోజు అమ్మ కథ చెప్పమంటుంది. కానీ విరాజ్ చెప్పడు. కూతురు ఇలాగే మారాం చేయడంతో ఒకరోజు విరాజ్ అమ్మ కథ చెప్తాడు. అసలు మహి తల్లి ఎవరు? ఎందుకు ఆమె వీరితో కలిసి ఉండట్లేదు? మహి అరుదైన వ్యాధిని జయించిందా? లేదా? అన్నది థియేటర్స్‌లో చూసి తెలుసుకోవాల్సిందే!
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment