‘‘నేను మాటలు అందించిన ‘కోట బొమ్మాళి’ (నవంబర్ 24), ‘హాయ్ నాన్న’ (డిసెంబరు 7) చిత్రాలు రెండు వారాల గ్యాప్‌లో విడుదలై సక్సెస్ అవడం సంతోషంగా ఉంది. ‘కోట బొమ్మాళి’ ΄పోలిటికల్ థ్రిల్లర్. ‘హాయ్ నాన్న’ ఎమోషన్స్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. రెండు విభిన్నమైన కథలకు మాటలు అందించిన నాకు మంచి పేరొచ్చింది. నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు, డైరెక్టర్ సుకుమార్‌గార్లు ప్రత్యేకంగా అభినందించడం మరచిపోలేను’’ అన్నారు.
మాటల రచయిత నాగేంద్ర కాశీ. ఇంకా తన కెరీర్ గురించి నాగేంద్ర మాట్లాడుతూ– ‘‘నాది కోనసీమ జిల్లా అమలాపురం. నాన్న నాగేశ్వరరావు, అమ్మ సత్యవతి. రచన, సాహిత్యంపై ఇష్టంతో ఇంటర్ చదివే రోజుల నుంచే కథలు రాయడం మొదలుపెట్టాను. నేను రాసిన కథలతో ‘నల్ల వంతెన’ అనే తొలి పుస్తకం పబ్లిష్ చేశాను. దీనికి నాలుగు అవార్డులు వచ్చాయి. తొలిసారి ‘పలాస 1978’ సినిమాకి కో రైటర్‌గా పని చేశా.
ఆ తర్వాత ‘తోలు బొమ్మలాట’ మూవీకి రచనా సహకారం చేశాను. ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాకి కథ ఇచ్చాను. నా ‘నల్ల వంతెన’లో ఓ కథ నచ్చడంతో నాకు ‘సుకుమార్ రైటింగ్స్‌లో’ చాన్స్ ఇచ్చారు డైరెక్టర్ సుకుమార్‌గారు. ‘విరూపాక్ష’కి రైటింగ్ విభాగంలో చేశా. ఆ తర్వాత రామ్‌చరణ్– బుచ్చిబాబుగార్ల మూవీకి బుచ్చిబాబుగారితో కలిసి మాటలు రాస్తున్నాను. ‘పుష్ప 2’ సినిమాకి రచయితల విభాగంలో చేస్తున్నాను. అలాగే రష్మిక నటిస్తున్న ‘రెయిన్‌బో’కి మాటలు అందిస్తున్నాను. సుకుమార్‌గారి వద్ద పని చేసే చాన్స్ రావడం నా లక్. భవిష్యత్తులో డైరెక్టర్ కావాలని ఉంది. ఐదు కథలు సిద్ధం చేసుకున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment