Director Narra Sivanagu Sensational Comments On Senior Hero Suman - Sakshi
Sakshi News home page

ఆడియో ఫంక్షన్‌కి ఆహ్వానిస్తే..రూ.2 లక్షలు అడిగారు.. సుమన్‌పై దర్శకుడు ఫైర్‌

Published Thu, Jun 22 2023 3:28 PM | Last Updated on Thu, Jun 22 2023 8:50 PM

Director Shiva Nagu Narra Sensational Comments On Senior Hero Suman - Sakshi

సీనియర్‌ హీరో సుమన్‌పై దర్శకుడు శివనాగు ఫైర్‌ అయ్యాడు. సినిమా  ఆడియో ఫంక్షన్‌కి రావాలని ఆహ్వానిస్తే..రూ.2 లక్షలు ఇస్తేనే వస్తానని చెప్పారని, ఓ సీనియర్‌ హీరో అలా చెప్పడం బాధాకరం అన్నారు. సుదర్శన్‌, రంగస్థలం మహేశ్‌, తాగుబోతు రమేశ్‌ కీలక పాత్రధారులుగా నర్రా శివనాగు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నట రత్నాలు’. ఇనయా సుల్తాన కథానాయిక. మర్డర్‌ మిస్టరీ క్రైం థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎవరెస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డా.దివ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించారు.

(చదవండి: నిర్మాతపై లైంగిక వేధింపుల కేసు.. స్టేట్‌మెంట్‌లో సంచలన విషయాలు!)

ఈ సందర్భంగా దర్శకుడు శివనాగు మాట్లాడుతూ.. . ఈ మధ్యకాలంలో చిన్న సినిమా ఫంక్షన్‌లకు ఎవరూ సహకరించట్లేదు. నేను గతంలో మూడు సినిమాలు తీసిన ఓ హీరోని ఈ వేడుకకు ఆహ్వానించా. ఆ వ్యక్తికి ఫోన్‌ చేస్తే అసిస్టెంట్‌తో మాట్లాడమని చెప్పారు. పది రోజులు సాగదీసి ఆయన మేకప్‌మెన్‌ ఫోన్‌ ఎత్తి ‘శివనాగు గారు రెండు లక్షలు ఇస్తే ఆడియో ఫంక్షన్‌కి వస్తారట అండీ’ అని చెప్పాడు. అంటే ఆడియో రిలీజ్‌ చేయాలంటే రెండు లక్షలు ఇవ్వాలా? డబ్బిచ్చి పొగడాలా? ఆ నటుడు ఎవరో కాదు.  సీనియర్‌ నటుడు సుమన్‌. ఏ హీరోనైనా దర్శకుడే తయారు చేస్తారు. సుమన్‌గారి తీరు చూశాక నా బాధ కలిగింది. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో పరిశ్రమ ఉంది’ అని మండిపడ్డారు.

‘చిన్న సినిమాతోనే పరిశ్రమ మనుగడ ఉంది. ప్రస్తుతం మినిమమ్‌ బడ్జెట్‌ చిత్రాలు ఇండస్ట్రీకి నాలుగో స్తంభంగా నిలుస్తున్నాయి. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని చికోటి ప్రవీణ్‌ అన్నారు.ఈ కార్యక్రమంలో ఎరపతినేని శ్రీనివాసరావు , దివ్యవాణి, డా. పద్మ తదితరులు పాల్గొన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement