Nata Ratnalu Movie
-
యాక్టర్స్‌గా మారిన డైరెక్టర్స్.. ఆ నటరత్నాలు ఎవరంటే!
ఇనయా సుల్తానా, సుదర్శన్ రెడ్డి, రంగస్థలం మహేష్, తాగుబోతు రమేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం నటరత్నాలు. ఎవరెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు. క్రైం కామెడీ థ్రిల్లింగ్ నేపథ్యంలో దర్శకుడు శివనాగు తెరకెక్కించారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి విశేషమైన స్పందన లభించింది. ఈ చిత్రం మే 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.ఈ సందర్భంగా దర్శకుడు శివనాగు మాట్లాడుతూ..'సినిమా అంటే నాకు ప్రాణం. ఇండస్ట్రీకి వచ్చి సినిమా తీయాలి అనే వాళ్లు ఎలా విఫలమవుతున్నారు? ఎలా సఫలమవుతున్నారు? ఏం చేస్తున్నారు? అనేది కథగా ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాను. నాకు ఎంతో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమాను మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా' అని అన్నారు.నిర్మాత చంటి యలమాటి మాట్లాడుతూ..' మంచి హిట్లు ఇచ్చిన డైరెక్టర్లను యాక్టర్లుగా మార్చిన సినిమానే నటరత్నాలు. డైరెక్టర్ శివ నాగు ఈ కథ చెప్పడం జరిగింది. ఇండస్ట్రీకి వచ్చి ఏదో సాధించాలని హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అవ్వాలని కలలు గనే యువత చాలామంది ఉన్నారు. ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. కచ్చితంగా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది' అని అన్నారు. ఈ చిత్రంలో అర్జున్ తేజ్, అర్చన, సుమన్ శెట్టి, సూర్యకిరణ్, ఏ. ఎస్ రవికుమార్ చౌదరి, టైగర్ శేషాద్రి కీలక పాత్రలు పోషించారు. -
'నటరత్నలు’.. ‘జాతి రత్నాలు’ అంత హిట్ అవ్వాలి
ఇనయ సుల్తానా, సుదర్శన్ రెడ్డి, రంగస్థలం మహేష్ మరియు తాగుబోతు రమేశ్ పాత్రల్లో నటించిన చిత్రం నటరత్నాలు. ఎన్నో హిట్లు ఇచ్చిన డైరెక్టర్లు కూడా ఈ సినిమాలో యాక్టర్లుగా యాక్ట్ చేయడం జరిగింది. చందనా ప్రొడక్షన్ సమర్పణలో ఎవరెస్ట్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించిన “నటరత్నాలు” క్రైం కామెడీ థ్రిల్లింగ్ నేపథ్యంలో దర్శకుడు శివనాగు తెరకెక్కించిన చిత్రం. ఈ సినిమా కి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో లో ముఖ్య అతిథులుగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ గారు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ గారు, దర్శకుడు కె ఎస్ రవికుమార్ చౌదరి, దర్శకుడు సముద్ర, డీ. ఎస్. రావు మరియు రామ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నిర్మాత దామోదర్ ప్రసాద్ గారు మాట్లాడుతూ.. ప్రతి ఇండస్ట్రీలో కష్టసుఖాలు ఉంటాయి, ఇది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి మన కష్టాలు ఎక్కువ కనబడతాయి అవన్నీ అధిగమించి నిలబడ్డమే కళ, ఇక్కడ ఉన్న వాళ్ళే దానికి నిదర్శనం. 'నటరత్నలు' జాతి రత్నాలు లా ఉంది పేరు అంతే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ చాలా బాగుంది. ప్రొడ్యూసర్స్ కి డైరెక్టర్ శివ నాగు కి ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ గారు మాట్లాడుతూ.. సినిమా అనేది ఒక మెడిసిన్ లాంటిది అది ఎంత తీసుకుంటే అంత మంచిది. నటరత్నాలు టైటిల్ చాలా బాగుంది. నటరత్న అంటే నందమూరి తారక రామారావు గారు ఆయన ఆశీస్సులతో నటరత్నాలు అనే టైటిల్ చాలా బాగా పెట్టారు.డైరెక్టర్ శివ నాగు ది కష్టపడే వ్యక్తిత్వం, 24 గ్రాఫ్స్ ని హ్యాండిల్ చేయగలిగిన వ్యక్తి. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కి డైరెక్టర్ శివ నాగు కి మంచి సినిమా అవ్వాలి మంచి సక్సెస్ తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. దర్శకుడు శివనాగు మాట్లాడుతూ .. సినిమా అంటే నాకు ప్రాణం సినిమానే నా జీవితం. సినిమా కోసం పుట్టాను సినిమాతోనే ప్రాణం వదులుతాను. సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమా తీయాలి అనే వాళ్ళు ఎలా విఫలమవుతున్నారు? ఎలా సఫలమవుతున్నారు? ఏం చేస్తున్నారు అనే కథగా ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాను’ అన్నారు. నిర్మాత చంటి యలమాటి మాట్లాడుతూ.. ‘ఈ కథ సినిమాలో సినిమా లాంటిది. ఇండస్ట్రీకి వచ్చి ఏదో సాధించాలని హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ అవ్వాలని కలగని యువత చాలామంది ఉన్నారు. డైరెక్టర్ శివ నాగు గారు డైనమిక్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్. ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం ఎంత బడ్జెట్ చెప్పారు అంతే బడ్జెట్లో సినిమా తీయగల దర్శకుడు శివ నాగు గారు. అతి త్వరలో సినిమా మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఈ సినిమా ని చూసి మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు. -
రెండు లక్షలు డిమాండ్ చేశాడు.. సీనియర్ హీరో సుమన్‌పై శివనాగు ఫైర్!
సీనియర్ హీరో సుమన్‌పై దర్శకుడు శివనాగు ఫైర్ అయ్యాడు. సినిమా ఆడియో ఫంక్షన్‌కి రావాలని ఆహ్వానిస్తే..రూ.2 లక్షలు ఇస్తేనే వస్తానని చెప్పారని, ఓ సీనియర్ హీరో అలా చెప్పడం బాధాకరం అన్నారు. సుదర్శన్, రంగస్థలం మహేశ్, తాగుబోతు రమేశ్ కీలక పాత్రధారులుగా నర్రా శివనాగు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నట రత్నాలు’. ఇనయా సుల్తాన కథానాయిక. మర్డర్ మిస్టరీ క్రైం థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డా.దివ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించారు. (చదవండి: నిర్మాతపై లైంగిక వేధింపుల కేసు.. స్టేట్మెంట్లో సంచలన విషయాలు!) ఈ సందర్భంగా దర్శకుడు శివనాగు మాట్లాడుతూ.. . ఈ మధ్యకాలంలో చిన్న సినిమా ఫంక్షన్లకు ఎవరూ సహకరించట్లేదు. నేను గతంలో మూడు సినిమాలు తీసిన ఓ హీరోని ఈ వేడుకకు ఆహ్వానించా. ఆ వ్యక్తికి ఫోన్ చేస్తే అసిస్టెంట్‌తో మాట్లాడమని చెప్పారు. పది రోజులు సాగదీసి ఆయన మేకప్‌మెన్ ఫోన్ ఎత్తి ‘శివనాగు గారు రెండు లక్షలు ఇస్తే ఆడియో ఫంక్షన్‌కి వస్తారట అండీ’ అని చెప్పాడు. అంటే ఆడియో రిలీజ్ చేయాలంటే రెండు లక్షలు ఇవ్వాలా? డబ్బిచ్చి పొగడాలా? ఆ నటుడు ఎవరో కాదు. సీనియర్ నటుడు సుమన్. ఏ హీరోనైనా దర్శకుడే తయారు చేస్తారు. సుమన్‌గారి తీరు చూశాక నా బాధ కలిగింది. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో పరిశ్రమ ఉంది’ అని మండిపడ్డారు. ‘చిన్న సినిమాతోనే పరిశ్రమ మనుగడ ఉంది. ప్రస్తుతం మినిమమ్ బడ్జెట్ చిత్రాలు ఇండస్ట్రీకి నాలుగో స్తంభంగా నిలుస్తున్నాయి. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని చికోటి ప్రవీణ్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఎరపతినేని శ్రీనివాసరావు , దివ్యవాణి, డా. పద్మ తదితరులు పాల్గొన్నారు. -
నవ్వించేందుకు రెడీ అవుతున్న 'నటరత్నాలు’
కంటెంట్‌లో దమ్ముంటే చిన్న సినిమాలను కూడా ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు. అందుకే టాలీవుడ్లో చోటా సినిమాలు భారీగా వస్తుంటాయి. డిఫరెంట్ స్టోరీలపై ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపుతున్న నేపథ్యంలో.. యంగ్ డైరెక్టర్స్ అలాంటి కథలతో సినిమాలను తెరకెక్కించి, విజయాన్ని సొంతం చేసుకుంటున్నారు. తాను కూడా అలాంటి డిఫరెంట్ కథతోనే ‘నటరత్నాలు’తెరకెక్కిస్తున్నానని చెబుతున్నాడు దర్శకుడు గాదె నాగభూషణం. ఎన్.ఎస్ నాగేశ్వర రావు నిర్మాణంలో రూపుదిద్దుకోనున్న వినూత్న కథాంశం 'నటరత్నాలు'. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా సాగుతున్నాయి. అతిత్వరలో పూజా కార్యక్రమాలతో ఘనంగా సినిమా ప్రారంభోత్సవం చేయబోతున్నారు మేకర్స్. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ పరివేక్షణ నర్రా శివ నాగు వహించగా ఎవరెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ సినిమాకు ఆనందాసు శ్రీ మణికంఠ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సుదర్శన్, రంగస్థలం మహేష్, అర్జున్ తేజ్,డా భద్రం, తమిళ నటుడు శేషాద్రి, తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా క్రైం, థ్రిల్లర్, మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. చిత్రంలో కామెడీ పార్ట్ హైలైట్ అయ్యేలా, ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునేలా కథకు తెరరూపమివ్వబోతున్నారట. జూన్ మొదటివారంలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి త్వరత్వరగా ఫినిష్ చేసేలా ప్లాన్ రెడీ చేసుకున్నామని చిత్ర యూనిట్ పేర్కొంది.