యాక్టర్స్‌గా మారిన డైరెక్టర్స్‌.. ఆ నటరత్నాలు ఎవరంటే! | Tollywood Movie Nata Ratnalu Releasing Tomorrow | Sakshi
Sakshi News home page

Nata Ratnalu Movie: క్రైం కామెడీ థ్రిల్లర్‌గా నటరత్నాలు.. రిలీజ్‌ ఎప్పుడంటే?

Published Thu, May 16 2024 9:39 PM | Last Updated on Thu, May 16 2024 9:40 PM

Tollywood Movie Nata Ratnalu Releasing Tomorrow

ఇనయా సుల్తానా, సుదర్శన్ రెడ్డి, రంగస్థలం మహేష్, తాగుబోతు రమేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం నటరత్నాలు. ఎవరెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు. క్రైం కామెడీ థ్రిల్లింగ్ నేపథ్యంలో దర్శకుడు శివనాగు తెరకెక్కించారు.  ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి విశేషమైన స్పందన లభించింది. ఈ చిత్రం మే 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

ఈ సందర్భంగా దర్శకుడు శివనాగు మాట్లాడుతూ..'సినిమా అంటే నాకు ప్రాణం. ఇండస్ట్రీకి వచ్చి సినిమా తీయాలి అనే వాళ్లు ఎలా విఫలమవుతున్నారు? ఎలా సఫలమవుతున్నారు? ఏం చేస్తున్నారు? అనేది కథగా ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాను. నాకు ఎంతో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమాను మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా' అని అన్నారు.

నిర్మాత చంటి యలమాటి మాట్లాడుతూ..' మంచి హిట్లు ఇచ్చిన డైరెక్టర్లను యాక్టర్లుగా మార్చిన సినిమానే నటరత్నాలు. డైరెక్టర్ శివ నాగు ఈ కథ చెప్పడం జరిగింది. ఇండస్ట్రీకి వచ్చి ఏదో సాధించాలని హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అవ్వాలని కలలు గనే యువత చాలామంది ఉన్నారు. ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. కచ్చితంగా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది' అని అన్నారు. ఈ చిత్రంలో అర్జున్ తేజ్, అర్చన, సుమన్ శెట్టి, సూర్యకిరణ్, ఏ. ఎస్ రవికుమార్ చౌదరి, టైగర్ శేషాద్రి కీలక పాత్రలు పోషించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement