లాలూ ప్రసాద్ యాదవ్‌కు అస్వస్థత
ఢిల్లీ:బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ శుక్రవారం అస్వస్థతకు గురైయ్యారు. దీంతో ఆయన్ను ఆర్జేడీ నేతలు నగరంలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అంతకుముందు మీడియాతో మాట్లాడిన లాలూ..రాబోవు లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో నే తమ పార్టీ పొత్తు పెట్టుకుంటుందని తెలిపారు.
గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై మండిపడ్డారు. మోడీ ఎప్పటికీ ప్రధాని మంత్రి కాలేరని యాదవ్ జోస్యం చెప్పారు. బిర్సాముండా జైలు నుంచి గత సోమవారం మధ్యాహ్నం లాలూ ప్రసాద్ యాదవ్ బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే.