బీహార్‌కు చెందిన మాజీ ఎంపీ పప్పు యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్(ఆర్‌జేడీ) అధినేత లాలూ యాదవ్, తేజస్వి యాదవ్‌లను కలుసుకున్నారు. ఆయన రాష్ట్రీయ జనతాదళ్ టిక్కెట్‌పై మాధేపురా నుండి పోటీచేయాలనే అభిలాషను వారి ముందు వ్యక్తం చేసినట్లు సమాచారం.
పప్పు యాదవ్ 2014లో ఆర్జేడీ టిక్కెట్‌పై మాధేపురా నుంచి గెలుపొందారు. అందుకే ఈసారి కూడా పప్పు యాదవ్‌ను ఆర్జేడీ మాధేపురా అభ్యర్థిగా నిలబెట్టే అవకాశాలున్నాయి. కాగా సింగపూర్‌లో ఉంటున్న లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్యకు సారణ్ సీటు ఇచ్చే విషయమై పార్టీ పరిశీలిస్తోందని వినికిడి. లాలూ గతంలో సారణ్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు.
రెండున్నరేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్-రాష్ట్రీయ జనతాదళ్‌ల ‘మహాకూటమి’ సీపీఐ (ఎంఎల్) లిబరేషన్‌తో పొత్తు పెట్టుకుని ఎన్డీఏకు గట్టి సవాల్ విసిరింది. అయితే రెండు నెలల క్రితం నితీష్ కుమార్ హఠాత్తుగా ఎన్డీఏలోకి రావడంతో ప్రస్తుతం పరిస్థితులు తారుమారయ్యాయి. బీహార్‌లో లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19, జూన్ ఒకటి మధ్య ఏడు దశల్లో జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment