పాట్నా : కుటుంబ విషయాల గురించి, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడితే సీఎం అయినా పీఎం అయినా క్షమించేది లేదంటున్నారు ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్. లాలు పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తేజస్వీ తొలిసారి మీడియా ముందు ఈ విషయంపై స్పందించారు.
ఈ సందర్భంగా రెండు రోజుల క్రితం బిహార్‌లో ట్రైనీ మహిళా కానిస్టేబుల్ మృతికి నిరసనగా మిగతా ట్రైనీ కానిస్టేబుళ్లు ఉన్నతాధికారుల మీద, కమాండెంట్ మీద దాడి చేసిన సంగతిని రిపోర్టర్ల దగ్గర ఉటంకిస్తూ ‘నిన్న ఉదయం అంతా ఇంత ముఖ్యమైన విషయాన్ని టెలికాస్ట్ చేసిన మీడియా సాయంత్రం అయ్యే సరికి హెడ్డింగ్స్ మార్చేసింది. అప్పటి నుంచి ప్రతి ఒక్కరు అరే.. వీళ్ల కుటుంబంలో ఏం జరుగుతుంది అంటూ మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఒకవేళ ఎవరైనా మా వ్యక్తిగత విషయాల గురించి కానీ, కుటుంబ విషయాల గురించి కానీ మాట్లాడితే సహించేది లేదు. ఆఖరికి అది సీఎం అయినా సరే.. పీఎం అయినా సరే’ అంటూ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment