
పట్నా: ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లయి ఆరునెలలైనా కాకమునుపే భార్య నుంచి విడాకులు కోరుతూ కోర్టుకెక్కారు. బిహార్ మాజీ సీఎం దరోగా రాయ్ మనుమరాలైన ఐశ్వర్యా రాయ్‌తో మే 12వ తేదీన తేజ్ ప్రతాప్ వివాహమైంది. భార్యతో సఖ్యత లేని కారణంగా హిందూ వివాహ చట్టంలోని సెక్షన్–13 ప్రకారం తేజ్ ప్రతాప్ విడాకులు కోరుతున్నారని ఆయన లాయర్ యశ్వంత్ కుమార్ శర్మ తెలిపారు. స్థానిక సివిల్ కోర్టులో ఈ మేరకు ఆయన కేసు వేశారు. ఈ వ్యవహారంపై స్పందించేందుకు తేజ్ ప్రతాప్, ఐశ్వర్యల కుటుంబాలు ఇష్టపడటం లేదు.
Comments
Please login to add a commentAdd a comment