వద్దన్నా.. ఆమెతో పెళ్లి చేశారు | Tej Pratap Yadav Files For Divorce In Patna Court | Sakshi
Sakshi News home page

వద్దన్నా.. ఆమెతో పెళ్లి చేశారు

Published Sun, Nov 4 2018 5:27 AM | Last Updated on Sun, Nov 4 2018 5:27 AM

Tej Pratap Yadav Files For Divorce In Patna Court - Sakshi

ఐశ్వర్యరాయ్‌, తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌

పట్నా: భార్య నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించిన బిహార్‌ మాజీ మంత్రి తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ తన వైవాహిక జీవితంపై పెదవి విప్పారు. తన ఇష్టం లేకుండానే ఉన్నత విద్యావంతురాలైన ఐశ్వర్యరాయ్‌ను పెళ్లాడానని, అప్పటి నుంచి జీవితం చాలా కష్టంగా సాగిందని అన్నారు. ‘అప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదని అమ్మానాన్నలకు స్పష్టంగా చెప్పినా ఎవరూ వినలేదు. ఐశ్వర్య నాకు తగిన జోడీ కాదు. నావి సాదాసీదా అలవాట్లు. నేను చాలా సాధారణ వ్యక్తిని. కానీ ఐశ్వర్య ఆధునిక భావాలున్న యువతి. ఢిల్లీలో చదువుకుంది. మెట్రో నగరాల జీవితానికి అలవాటుపడింది. పెళ్లి తరువాత ఆమెతో జీవితం చాలా కష్టంగా గడిచింది. ఇంకెంత కాలం ఇలా ఉండాలి?’ అని తేజ్‌ ప్రతాప్‌ మీడియాతో అన్నారు. విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకునే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. రెండు నెలల నుంచి భార్యతో మాట్లాడటంలేదని తెలిపారు. ఆర్జేడీ ఎమ్మెల్యే చంద్రికా రాయ్‌ కుమార్తె అయిన ఐశ్వర్యరాయ్‌ను తేజ్‌ ప్రతాప్‌ ఈ ఏడాది మే 12న వివాహమాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement