lalu sons
-
లాలూ కొడుకు విడాకుల దరఖాస్తు
పట్నా: ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లయి ఆరునెలలైనా కాకమునుపే భార్య నుంచి విడాకులు కోరుతూ కోర్టుకెక్కారు. బిహార్ మాజీ సీఎం దరోగా రాయ్ మనుమరాలైన ఐశ్వర్యా రాయ్‌తో మే 12వ తేదీన తేజ్ ప్రతాప్ వివాహమైంది. భార్యతో సఖ్యత లేని కారణంగా హిందూ వివాహ చట్టంలోని సెక్షన్–13 ప్రకారం తేజ్ ప్రతాప్ విడాకులు కోరుతున్నారని ఆయన లాయర్ యశ్వంత్ కుమార్ శర్మ తెలిపారు. స్థానిక సివిల్ కోర్టులో ఈ మేరకు ఆయన కేసు వేశారు. ఈ వ్యవహారంపై స్పందించేందుకు తేజ్ ప్రతాప్, ఐశ్వర్యల కుటుంబాలు ఇష్టపడటం లేదు. -
అసెంబ్లీ బరిలో అన్నదమ్ములు
వాళ్లిద్దరూ అన్నదమ్ములు. ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు. అలాంటి వాళ్లిద్దరూ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే ఒక నియోజకవర్గం మాత్రం కాదు.. వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. వాళ్లే ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలుప్రసాద్ తనయులు. ఒకరు తేజ్ ప్రతాప్ కాగా మరొకరు తేజస్వి యాదవ్. వీళ్లలో తేజ్ ప్రతాప్ మహువా నుంచి, తేజస్వి యాదవ్ రాఘోపూర్ నుంచి అసెంబ్లీ బరిలోకి దిగుతున్నారు. ఈ విషయం బుధవారం నిర్ధారణ అయ్యింది. ఆర్జేడీ తాజాగా విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో వీళ్లిద్దరి పేర్లు ఆయా నియోజకవర్గాలకు ఖరారు చేశారు.