laluprasad yadav
-
లాండ్ ఫర్ జాబ్ స్కాంలో లాలూకు షాక్
ఢిల్లీ: ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు మరో షాక్ తగిలింది. లాలూతో పాటు ఆయన తనయుడు తేజస్వి, మరో ఎనిమిది మందిపై ఈ కేసులో సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలైంది. ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రౌస్ అవెన్యూ కోర్టులో 96 పేజీల డాక్యుమెంట్లను సమర్పించింది. ఢిల్లీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌పై ఆగస్టు 13న వాదనలు వినిపించేందుకు లిస్ట్ చేశారు.Enforcement Directorate filed Ist supplementary charge sheet against RJD leader Tejaswhi Yadav and other accused in land for job scam case in the Rouse Avenue Court. Supplementary Charge sheet has named 11 accused. It also has 96 relied-upon documents.The court listed the…— ANI (@ANI) August 6, 2024కాగా, జనవరిలో సైతం ఈడీ బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, ఆమె కుమార్తెలు ఎంపీ మిసా భారతి, హేమా యాదవ్‌తో పాటు వ్యాపారవేత్త అమిత్ కత్యాల్, మాజీ రైల్వే ఉద్యోగి హృదయానంద్ చౌదరిలను నిందితులుగా పేర్కొంటూ ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 2004 నుంచి 2009 వరకు లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో పలువురు అభ్యర్థుల వద్ద భూమిని లంచంగా తీసుకొని రైల్వే ఉద్యోగాల ఇప్పించారనే ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ కేసులో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. -
బిహార్: ప్రతిపక్షపార్టీ నాయకుడిగా తేజస్వీ యాదవ్
పట్నా: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి లలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ బిహార్‌లో ప్రతిపక్ష కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా వ్యవహరించనున్నారు. మహాకూటమిలో చర్చల అనంతరం రాబోయే రాష్ట్ర ఎన్నికల్లో 243 సీట్లకు గాను 144 సీట్లను ఆర్జేడీకి కేటాయించారు. కాంగ్రెస్ పార్టీకి 70, లెఫ్ట్ పార్టీలకు 29, జార్ఖండ్ ముక్తి మోర్చాకు ఆర్జేడీ కోటా నుంచి సీట్లు కేటాయించామని కూటమి శనివారం ప్రకటించింది. అయితే ఈ విభజనతో కలత చెందిన చిన్న పార్టీలలో ఒకటైన వీఐపీ పార్టీ కూటమి నుంచి వైదొలింగి. తాము మోసపోయామని ఆ పార్టీ నేతలు విచారణ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ, ఇది ప్రజలకు, డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి మధ్య పోరాటమని పేర్కొన్నారు. ఇక కరోనా సమయంలో దేశంలో అతి పెద్ద బీహార్ ఎలక్షన్లు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ మొదలు కాగా అక్టోబర్ 8తో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. బీహార్‌లో అక్టోబర్ 28, నవంబర్ 3, 7వ తేదీలలో పోలింగ్ జరగనుంది. కాగా ఎన్నికల ఫలితాలు నవంబర్ 10న ప్రకటించనున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న నితీశ్‌కుమార్ ప్రభుత్వం నాలుగవసారి కూడా తాము అధికారాన్ని చేజిక్కించుకుంటామని ధీమాగా ఉంది. ఇక వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం రైతు వ్యతిరేకమని ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని ఆర్జేడీ వ్యూహం రచిస్తోంది. దానితో పాటు కరోనాను ఎదుర్కోవడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని ప్రచారం చేయాలని కూడా ప్రతిపక్షం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కరోనా సమయంలో జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ఎలక్షన్ కమిషన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఓటు వేసే సమయాలను కూడా మార్పు చేసింది. చదవండి: బిహార్‌లో ఎల్జీపీ దూకుడు.. కీలక భేటీ -
లాలూని మరచిపోలేదు...
మిగిలిన ఉత్తరాది హిందీ రాష్ట్రాల్లో మాదిరిగానే బిహార్‌లో సైతం లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏకు ప్రధాని నరేంద్రమోదీకి ఉన్న జనాకర్షణ శక్తి, సాధించిన విజయాలు, మీడియాలో ఆయనకున్న ‘ఇమేజ్’ ప్రధానాస్త్రాలుగా మారాయి. ఆర్జేడీ నేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో లేకుండా జైల్లో గడపడం ప్రతిపక్షాల మహాగఠ్‌బంధన్‌కు పెద్ద లోటుగా కనిపిస్తోంది. కాని, ఆయన పార్టీ అధికారంలో ఉన్న కాలంలో బడుగు వర్గాలకు చేసిన మేలు, అగ్రవర్ణాలను రాజకీయంగా అదుపులోకి తెచ్చిన తీరు ఆర్జేడీ నాయకత్వంలోని మహా కూటమికి అనుకూలాంశాలుగానే కొంత మేరకు పనిచేస్తున్నాయి. లాలూ ప్రసాద్ తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన చప్రా పట్టణంలో బీజేపీ ఆఫీసు నుంచి మోదీ పేరు మార్మోగేలా, ‘‘హర్‌హర్ మోదీ–ఘర్ ఘర్ మోదీ’’, ‘దేశ సైనికులకు గౌరవ మర్యాదలు ఇస్తున్నాం’ అంటూ నినాదాలు వినిపిస్తున్నాయి. సమీపంలోని ఆర్జేడీ కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి పార్టీ ఎమ్మెల్యే జితేంద్రకుమార్ రాయ్ మాట్లాడుతూ, ‘‘మోదీ–మోదీ అంటూ అరిచేవారికి డబ్బులిస్తున్నారు. కానీ, మన వాళ్లు ఏమీ ఆశించకుండా పని చేయడానికి ముందుకు వస్తున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్‌లో మా కూటమి తరఫున ప్రచారం చేస్తాం, భయ్యా!’ అంటూ స్థానిక యువకులు ముందుకొస్తున్నారు,’’ అని చెప్పారు. ఇవన్నీ ఒక ఎత్తయితే లాలూ లేని లోటు మరో ఎత్తు. లాలూ ఉంటే ఎన్నికల వ్యూహం భిన్నంగా ఉంటుంది. ఎన్నికల ప్రచా రంలో లాలూ లేని లోటు నిజమేనని జేపీ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ లాల్బాబూ యాదవ్ అభిప్రాయపడ్డారు. ‘‘లాలూజీకి గొప్ప జ్ఞాపకశక్తి ఉంది. నాయకులు, కార్యకర్తల పేర్లన్నీ ఆయనకు ఎరుకే. జనంతో మమేకమౌతూ ప్రచారం చేస్తారు’’ అంటూ ఆయన గుర్తుచేశారు. ఏ అవకాశం వదలని లాలూ 2015 అసెంబ్లీ ఎన్నికల్లో లాలూ, నితీశ్, కాంగ్రెస్‌తో కూడిన కొత్త కూటమిని లాలూ విజయవంతంగా ముందుకు నడిపించారు. మోదీ నాయకత్వంలోని ఎన్డీఏను ఈ ఎన్నికల్లో మట్టి కరిపించారు. ఈ ఎన్నికల సమయంలోనే ‘రిజర్వేషన్లను సమీక్షించాలి’ అంటూ ఆరెసెస్ అధినేత మోహన్ భాగవత్ ప్రకటన చేయగానే లాలూ ఆయనపై యుద్ధం ప్రకటించారు. బీజేపీ అధికారంలోకి వస్తే భాగవత్ చెప్పినట్టు రిజర్వేషన్లు పోతాయంటూ బీసీల్లో ఉన్న భయాందోళనలను అసెంబ్లీ ఎన్నికల్లో తన కూటమికి అనుకూలంగా లాలూ వాడుకున్నారు. కాని, ప్రస్తుత ఎన్నికల్లో ప్రధానాంశం ‘మోదీ కాదు’ అంటూనే ప్రధానికి పరోక్షంగా ఆర్జేడీ నేతలు ప్రచారం చేస్తున్నారు. మోదీకి ఉన్న జనాదరణ, ఇమేజ్ వల్ల బీజేపీ కూటమికి పెద్ద ప్రయోజనం ఉండదనే మొండి వాదనతోనే ఆర్జేడీ నేతలు, కార్యకర్తలు కాలం గడుపుతున్నారు. వ్యక్తి పూజకు ఆర్ఎస్సెస్ పరోక్ష ఆమోదముద్ర? సంఘ్ పరివార్ కుటుంబ పెద్ద ఆరెసెస్ కార్యకర్తలు పట్టుదలతో ఇంటింటికీ తిరుగుతూ కేంద్రంలో ఎన్డీఏ సర్కారు సాధించిన విజయాలు, మోదీ శక్తి సామర్థ్యాల గురించి విపరీత ప్రచారం చేస్తున్నారు. సిద్ధాంతరీత్యా వ్యక్తి పూజను వ్యతిరేకించే ఆరెసెస్ కూడా ఇలా వ్యవహరించడం వింతగా ఉన్నా ఎన్నికల్లో ఇది ఎన్డీఏకు అనుకూలాంశంగా మారింది. ఐదేళ్లలో కొత్తగా ఉద్యోగాలు రాక అసంతృప్తితో ఉన్న యువతను బీజేపీకి అనుకూలంగా మలచడానికి తీవ్ర జాతీయవాద భావనలను కాషాయ కార్యకర్తలు ఉపయోగించుకుంటున్నారు. ‘‘దేశం సురక్షితంగా ఉండాలంటే’ మోదీ ముఖం చూసి బీజేపీ కూటమికి ఓటేయాలనే సందేశాన్ని వాడవాడలా వినిపిస్తున్నారు. ఆర్జేడీని మినహాయిస్తే మిత్రుల బలం అంతంతే! మహా కూటమిలో ఆర్జేడీని మినహాయిస్తే కాంగ్రెస్, కులాల పునాదులపై ప్రారంభమైన ఆరెలెస్పీ, హెచ్ఏఎం, వీఐపీ పార్టీల బలం అంతంత మాత్రమే. ఆయా వర్గాల ప్రజలను ఆకట్టుకోవడంలో వాటి శక్తిసామర్థ్యాలు ఇంకా తేలలేదు. ఈ పార్టీలన్నింటినీ సంస్థాగతంగా ఆర్జేడీ, లాలూ చిన్న కొడుకు తేజస్వీ యాదవ్ వ్యూహాలు, లాలూ చేసిన మేలు వంటి అంశాలే ముందుకు నడిపించాల్సిన పరిస్థితి నెలకొంది. కూటమి పార్టీల మధ్య ఓట్ల బదిలీ ఎలా సాగుతుందనేది కూడా అంచనావేసి చెప్పడం కష్టం. బిహార్‌లో సామాజిక న్యాయం విషయంలో లాలూ ఎంతో సాధించారు. అయితే ఈ అంశానికి ఉన్న పరిమితులే ఆయనను ఒక దశ దాటి ముందుకుసాగనివ్వ లేదు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కులాలన్నింటినీ ఓ మేరకు బలోపేతం చేసిన లాలూ చివరికి తన పార్టీని యాదవుల పార్టీగా మార్చారనే చెడ్డ పేరు మిగుల్చుకున్నారు. -
‘సీఎం అయినా.. పీఎం అయినా వదిలేది లేదు’
పాట్నా : కుటుంబ విషయాల గురించి, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడితే సీఎం అయినా పీఎం అయినా క్షమించేది లేదంటున్నారు ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్. లాలు పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తేజస్వీ తొలిసారి మీడియా ముందు ఈ విషయంపై స్పందించారు. ఈ సందర్భంగా రెండు రోజుల క్రితం బిహార్‌లో ట్రైనీ మహిళా కానిస్టేబుల్ మృతికి నిరసనగా మిగతా ట్రైనీ కానిస్టేబుళ్లు ఉన్నతాధికారుల మీద, కమాండెంట్ మీద దాడి చేసిన సంగతిని రిపోర్టర్ల దగ్గర ఉటంకిస్తూ ‘నిన్న ఉదయం అంతా ఇంత ముఖ్యమైన విషయాన్ని టెలికాస్ట్ చేసిన మీడియా సాయంత్రం అయ్యే సరికి హెడ్డింగ్స్ మార్చేసింది. అప్పటి నుంచి ప్రతి ఒక్కరు అరే.. వీళ్ల కుటుంబంలో ఏం జరుగుతుంది అంటూ మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఒకవేళ ఎవరైనా మా వ్యక్తిగత విషయాల గురించి కానీ, కుటుంబ విషయాల గురించి కానీ మాట్లాడితే సహించేది లేదు. ఆఖరికి అది సీఎం అయినా సరే.. పీఎం అయినా సరే’ అంటూ హెచ్చరించారు. -
లాలూ కొడుకు విడాకుల దరఖాస్తు
పట్నా: ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లయి ఆరునెలలైనా కాకమునుపే భార్య నుంచి విడాకులు కోరుతూ కోర్టుకెక్కారు. బిహార్ మాజీ సీఎం దరోగా రాయ్ మనుమరాలైన ఐశ్వర్యా రాయ్‌తో మే 12వ తేదీన తేజ్ ప్రతాప్ వివాహమైంది. భార్యతో సఖ్యత లేని కారణంగా హిందూ వివాహ చట్టంలోని సెక్షన్–13 ప్రకారం తేజ్ ప్రతాప్ విడాకులు కోరుతున్నారని ఆయన లాయర్ యశ్వంత్ కుమార్ శర్మ తెలిపారు. స్థానిక సివిల్ కోర్టులో ఈ మేరకు ఆయన కేసు వేశారు. ఈ వ్యవహారంపై స్పందించేందుకు తేజ్ ప్రతాప్, ఐశ్వర్యల కుటుంబాలు ఇష్టపడటం లేదు. -
పెళ్లి వేడుకలో మాజీ సీఎం స్టెప్పులు
పాట్నా: బీహర్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్, ఐశ్వర్యరాయ్‌ల వివాహం శనివారం కన్నులపండువగా జరిగింది. అంగరంగవైభవంగా జరిగిన ఈ వేడుకకు... రాజకీయ ప్రముఖులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బిహార్ గవర్నర్ సత్యపాల్ మాలిక్, ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌లతో పాటు... ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్, కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్, ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ తదితరులు హాజరయ్యారు. వేదికపై ఆశీనులైన నీతీశ్ నవ దంపతులను ఆశీర్వదించారు. దాణా కుంభకోణంలో ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్న లాలూ.. తన కుమారుడి వివాహం నిమిత్తం మూడు రోజుల పెరోల్‌పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత లాలూ ఇంటా పెళ్లి భాజాలు మోగడంతో అంతా ఆనందంతో ఆడి పాడారు. వివాహ వేడుకల్లో భాగంగా ఓ భోజ్ పురి పాటకు బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవితో పాటు కుమార్తె మీసా భారతి, కొడుకు తేజస్వీ యాదవ్ లు, నవ దంపతులు స్టెప్పులేశారు. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘ లగావెలు జాబ్ లిప్‌స్టిక్’ అనే భోజ్‌పురి పాటతో పాటు పలు హిందీ పాటలకు రబ్రీదేవి నృత్యం చేశారు. ఈ వివాహం కోసం ప్రత్యేకంగా సాంగ్స్ కంపోజ్ చేయించగా, వాటికి కూడా అందరూ డ్యాన్స్ చేశారు. -
లాలూ కొడుకు పెళ్లికి రాహుల్
రాంచీ/పట్నా: రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక వాద్రా హాజరు కానున్నారు. పెళ్లికి రాష్ట్రపతి కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ తదితరులను ఆహ్వానించారు. తేజ్ ప్రతాప్æ వివాహం ఆర్జేడీ ఎమ్మెల్యే చంద్రికా రాయ్ కుమార్తె ఐశ్వర్యతో శనివారం జరగనుంది. లాలూకు 6 వారాల బెయిల్ దాణా స్కాంలో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూకు 6 వారాల తాత్కాలిక బెయిల్ మంజూరైంది. ఆయన అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ మంజూరు చేస్తూ జార్ఖండ్ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. మూడు రోజుల పెరోల్‌పై బయటకు వచ్చిన లాలూ గురువారం సాయంత్రం పట్నా చేరుకున్నారు. లాలూకు రాందేవ్ ఆరోగ్య సూచనలు బిహార్‌లోని నలంద, గయా జిల్లాల్లో మంగళవారం నుంచి యోగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్న యోగా గురువు బాబా రాందేవ్ శుక్రవారం లాలూ నివాసంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకునేందుకు నిత్యం యోగా చేయాలని లాలూకు సూచించారు. -
మా నాన్నకు ప్రాణహాని ఉంది!
రాంచీ: ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌యాదవ్‌ను దాణా కుంభకోణం వెంటాడుతోంది. దాణా కుంభకోణానికి సంబంధించిన నాలుగో కేసులోనూ ఆయనను దోషిగా తేల్చిన రాంచీ కోర్టు.. శనివారం లాలూకు 14 ఏళ్ల జైలుశిక్ష, రూ. 60 లక్షల జరిమానా విధించింది. దాణా స్కాంలో లాలూకు వరుసగా జైలుశిక్షలు పడుతున్న నేపథ్యంలో ఆయన తనయుడు తేజస్వి యాదవ్ స్పందించారు. ‘మా నాన్నకు ప్రాణహాని ఉంది. ఆయన ప్రాణాలకు ముప్పుందని భయం కలుగుతోంది’ అని ఆయన శనివారం విలేకరులతో పేర్కొన్నారు. తన తండ్రికి వ్యతిరేకంగా ఎవరో కుట్ర చేసినట్టు కనిపిస్తోందని తెలిపారు. ‘బీజేపీ, (బిహార్) సీఎం నితీశ్‌కుమార్ లాలూను చూసి భయపడుతున్నారు. ఆయన జైలు నుంచి బయటకు రావొద్దని కోరుకుంటున్నారు. లాలూ జైలు నుంచి వస్తే.. రెండోసారి ప్రధానమంత్రి కావాలన్న నరేంద్రమోదీ కల నెరవేరదన్న విషయం వారికి తెలుసు. అందుకే ఇలా చేస్తున్నారు’ అని తేజస్వి పేర్కొన్నారు. తేజస్వి వ్యాఖ్యలను బిహార్ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత సుశీల్‌కుమార్ మోదీ కొట్టిపారేశారు. జైలులో లాలూను ఎవరు కలువలేరు. అలాంటప్పుడు ఆయన ప్రాణాలకు ముప్పు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. -
రాజ్యసభకు ఆర్జేడీ అభ్యర్ధుల నామినేషన్
బీహార్: రాజ్యసభ స్థానాలకు నామినేషన్ సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్ధులు నామినేషన్ వేసేందుకు క్యూ కడుతున్నారు. పార్టీ నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో ఆర్జేడీ అభ్యర్ధులు మనోజ్ జహ, పార్టీ సీనియర్ నేత కరీంలు సోమవారం పాట్నాలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. బీహార్ అసెంబ్లీలో ఆర్జేడీకి స్సష్టమైన మెజారిటీ ఉండటంతో రెండు స్థానాలను ఆర్జేడీ కైవసం చేసుకోనుంది. -
'హార్మోనియం వాయించుకో.. వెచ్చగా ఉంటుంది'
సాక్షి, న్యూఢిల్లీ : ఒక కేసులో దోషిగా తేలి శిక్ష ఖరారు చేసే సమయంలో ఆ వ్యక్తి ముఖంలో సహజంగా భయం ఉంటుంది. న్యాయమూర్తి ఎన్నేళ్ల జైలు శిక్ష విధిస్తారోనని దిగులు ఉంటుంది. కానీ, దాణా కుంభకోణం కేసులో అరెస్టు అయ్యి దోషిగా తేలిన బీహార్ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ముఖంలో మాత్రం ఆ ఛాయలు కనిపించలేదు. పైగా కోర్టులో న్యాయమూర్తి శివపాల్ సింగ్‌కు ఆయనకు చాలా సరదా సంభాషణ సాగింది. అది మాములుగా కాదు.. కడుపుచెక్కలయ్యేలా నవ్వుకునేంత జోకులతో.. ఇంతకీ లాలూ, న్యాయమూర్తి ఏం మాట్లాడుకున్నారంటే.. లాలూ : జైలులో బాగా చల్లగా ఉంది జస్టీస్ శివపాల్ సింగ్ : నీకు చలిగా ఉంటే హార్మోనియం, తబలా వాయించుకో వేడిగా ఉంటుంది లాలూ : జైలులో ట్రాన్స్‌జెండర్స్ తోటి ఖైదీలను పెళ్లి చేసుకోండంటూ వేధిస్తున్నారు. జస్టీస్ శివపాల్ సింగ్ : ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారు కదా ! అంతా చక్కబడుతుంది. లాలూ : దయచేసి చాలా శాంతమైన మనసుతో నాకు శిక్షను ఖరారు చేయండి జస్టీస్ శివపాల్ సింగ్ : మీ మంచికోరుకునే వారు కూడా నాకు ఫోన్లు చేశారు. మీరేం బాధపడవద్దు.. మీకు శిక్ష విధించేటప్పుడు చట్టాన్ని మాత్రమే అనుసరిస్తాను. అలాగే, లాలూకు శిక్ష విధించే సమయంలో ఓపెన్ జైలులో ఉంచితేనే మంచిదని న్యాయమూర్తి శివపాల్ సింగ్ అన్నారు. ఎందుకంటే గోవుల పెంపకం ఎలాగో తెలుస్తుందంటూ చమత్కరించారు. దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌తోపాటు మొత్తం 15మందికి జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. లాలూకు మూడున్నరేళ్ల జైలు శిక్షతోపాటు రూ.5లక్షల జరిమాన విధించారు. -
జైల్లో లాలూకు చపాతీ, పప్పు!
రాంచీ: దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలి జైల్లో ఉంటున్న బిహార్ మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్(ఖైదీ నంబర్ 3351)కు అధికారులు ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. ఆయనకు టీవీతో పాటు ఓ వార్తాపత్రికను అందజేసినట్లు ఇక్కడి బిర్సాముండా జైలు సూపరింటెండెంట్ అశోక్ కుమార్ చౌదరి ఆదివారం తెలిపారు. శనివారం రాత్రి లాలూకు ఆహారంగా చపాతీ, పప్పు, క్యాబేజీని అందించినట్లు వెల్లడించారు. జైలు నిబంధనల మేరకు పనిదినాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ లాలూను కలుసుకునేందుకు సందర్శకుల్ని అనుమతిస్తామన్నారు. -
లాలూ కుమార్తెపై ఈడీ చార్జిషీట్
న్యూఢిల్లీ: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి, ఆమె భర్త శైలేశ్ కుమార్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీట్ దాఖలు చేసింది. ప్రత్యేక కోర్డు జడ్జి ఎన్కే మల్హోత్రా ఎదుట ఈడీ న్యాయవాది నితేశ్ రాణా శనివారం చార్జిషీటు దాఖలు చేశారు. మీసా, శైలేశ్‌లపై నమోదైన మనీ ల్యాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ ఇప్పటికే ఢిల్లీలోని వారి ఫామ్ హౌస్‌ను అటాచ్ చేసింది. ‘ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ కింద దక్షిణ ఢిల్లీలోని ఫామ్ హౌస్‌ను అటాచ్ చేశాం. ఆ ఫామ్ హౌస్ మీసా, శైలేశ్‌లకు చెందినది. మిషైల్ ప్యాకర్స్ అండ్ ప్రింటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద నమోదైంది. 2008–09లో మనీ ల్యాండరింగ్‌లో భాగంగా రూ.1.2 కోట్లతో దాన్ని కొనుగోలు చేశారు’ అని ఈడీ పేర్కొంది. మీసా భారతి, శైలేశ్ ఈ కంపెనీకి డైరెక్టర్లుగా కూడా పని చేశారని ఆరోపించింది. -
లాలూ ‘దాణా’ కేసులో తీర్పు నేడే!
రాంచీ: బిహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూప్రసాద్ యాదవ్, జగన్నాథ్ మిశ్రా సహా 22 మందిపై నమోదైన దాణా కుంభకోణం కేసులో ఇక్కడ సీబీఐ కోర్టు శనివారం తీర్పు వెలువరించనుంది. విచారణకు హాజరయ్యేందుకు లాలూ తన కుమారుడు తేజస్వీతో కలిసి శుక్రవారం రాంచీకి చేరుకున్నారు. 1991–94 కాలంలో దియోగఢ్(ప్రస్తుతం జార్ఖండ్‌లో ఉంది) ట్రెజరీ నుంచి దాణా కోసం రూ.89 లక్షలకుపైగా అక్రమంగా డ్రాచేసినట్లు లాలూ సహా 38 మందిపై సీబీఐ 1997, అక్టోబర్ 27న చార్జిషీట్ దాఖలుచేసింది. ఈ కేసు విచారణ జరుగుతున్న కాలంలో 11 మంది చనిపోగా, ముగ్గురు అప్రూవర్లుగా మారిపోయారు. -
నితీశ్, లాలుకు వైఎస్ జగన్ అభినందనలు
-
నితీశ్, లాలుకు వైఎస్ జగన్ అభినందనలు
హైదరాబాద్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయాన్ని సాధించిన నితీశ్‌కుమార్, లాలు ప్రసాద్ యాదవ్ ను వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. వైఎస్ జగన్ ట్విట్టర్లో నితీశ్, లాలుకు అభినందనలు తెలిపారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిగా జత నితీశ్, లాలు అపూర్వ విజయాన్ని సాధించారు. 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‌లో జేడీయూ, ఆర్జేడీ కూటమి 178 స్థానాలతో తిరుగులేని మెజారిటీ సాధించింది. ఈ సందర్భంగా నితీశ్, లాలును వైఎస్ జగన్ అభినందించారు. -
జూన్ 11న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు:
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: లాలుప్రసాద్ యాదవ్ (రాజకీయవేత్త) సత్యన్ శివకుమార్ (నటుడు) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 7. వీరు ఈ సంవత్సరం ఆధ్యాత్మికోన్నతితోపాటు ప్రాపంచిక విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. పుట్టిన తేదీలో రెండు ఒకట్లు ఉండటం వల్ల గొప్ప నాయకుడిగా, మార్గదర్శకుడిగా మన్ననలు అందుకుంటారు. సంఘంలో విశేష పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు లభించడంతోపాటు విదేశీ పర్యటనలు విజయవంతమవుతాయి. దైవకార్యాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. పూర్తి ఆధ్యాత్మికతో ఉండటం వల్ల సంసార జీవనానికి దూరమయే అవకాశం ఉంది కాబట్టి ఆధ్యాత్మికతతో పాటు ప్రాపంచిక విషయాల పట్ల కూడా ఆసక్తి చూపితే బాగుంటుంది. గురువులకు, వేదపండితులకు, ఆధ్యాత్మిక రంగాలలో ఉన్న వారికి సన్మానాలు, సత్కారాలు జరుగుతాయి. లక్కీనంబర్స్: 1,2,6,7; లక్కీ కలర్స్: వైట్, గ్రే, క్రీమ్, ఎల్లో. లక్కీ డేస్: సోమ, గురు, శుక్రవారాలు.సూచనలు: గురువులును, పండితులను, పెద్దలను గౌరవించడం, దక్షిణామూర్తిని, సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని ఆరాధించటం, వృద్ధాశ్రమాలలో అన్నదానం చేయడం. - డా. మహమ్మద్ దావూద్, జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు -
మాయావతితో దోస్తీకి సిద్దం: ములాయం
న్యూఢిల్లీ: మాయావతి నేతృత్వంలోని బహుజన సమాజ్‌వాది పార్టీతో చేతులు కలిపేందుకు సిద్దమని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ప్రకటించారు. అయితే చిన్న మెలిక పెట్టారు. ఇందుకు ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ చొరవ తీసుకోవాలని అన్నారు. ' ఈ విషయంలో లాలూ చొరవ తీసుకుంటే, బీఎస్పీతో చేతులు కలిపేందుకు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు' అని ములాయం అన్నారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి వ్యతిరేకంగా బీఎస్పీ, ఎస్పీ కలిసి పనిచేయాలని లాలూ చేసిన సూచన గురించి అడిగినప్పుడు ములాయం ఈ విధంగా స్పందించారు. 23 ఏళ్ల విరామం తర్వాత బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్, జేడీ(యూ) నాయకుడు నితీష్ కుమార్ మళ్లీ ఒక్కటయ్యారు. ఇదే తరహాలో బీఎస్పీ, ఎస్పీ కలిసిపోవాలని ఆయన సూచించారు. 1993లో యూపీలో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. అయితే ఈ కూటమి ఓడిపోవడంతో బీఎస్సీతో కలిసి పోటీ చేసి తప్పుచేశామని అప్పట్లో ములాయం సింగ్ వ్యాఖ్యానించారు. ఏనుగు గుర్తు ఉన్న బీఎస్సీతో సైకిల్ గుర్తు ఉన్న సమాజ్‌వాదీ పార్టీకి మళ్లీ జట్టు కుదురుతుందో, లేదో చూడాలి.