రాంచీ: దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలి జైల్లో ఉంటున్న బిహార్ మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్(ఖైదీ నంబర్ 3351)కు అధికారులు ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. ఆయనకు టీవీతో పాటు ఓ వార్తాపత్రికను అందజేసినట్లు ఇక్కడి బిర్సాముండా జైలు సూపరింటెండెంట్ అశోక్ కుమార్ చౌదరి ఆదివారం తెలిపారు. శనివారం రాత్రి లాలూకు ఆహారంగా చపాతీ, పప్పు, క్యాబేజీని అందించినట్లు వెల్లడించారు. జైలు నిబంధనల మేరకు పనిదినాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ లాలూను కలుసుకునేందుకు సందర్శకుల్ని అనుమతిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment