రాంచీ: బిహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూప్రసాద్ యాదవ్, జగన్నాథ్ మిశ్రా సహా 22 మందిపై నమోదైన దాణా కుంభకోణం కేసులో ఇక్కడ సీబీఐ కోర్టు శనివారం తీర్పు వెలువరించనుంది. విచారణకు హాజరయ్యేందుకు లాలూ తన కుమారుడు తేజస్వీతో కలిసి శుక్రవారం రాంచీకి చేరుకున్నారు. 1991–94 కాలంలో దియోగఢ్(ప్రస్తుతం జార్ఖండ్‌లో ఉంది) ట్రెజరీ నుంచి దాణా కోసం రూ.89 లక్షలకుపైగా అక్రమంగా డ్రాచేసినట్లు లాలూ సహా 38 మందిపై సీబీఐ 1997, అక్టోబర్ 27న చార్జిషీట్ దాఖలుచేసింది. ఈ కేసు విచారణ జరుగుతున్న కాలంలో 11 మంది చనిపోగా, ముగ్గురు అప్రూవర్లుగా మారిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment