పాట్నా: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు శుక్రవారం జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాణా కుంభకోణం కేసులో అరెస్టై శిక్ష అనుభవిస్తున్న లాలూకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. కాగా, లాలూ సీఎంగా ఉన్న సమయంలో 1990ల్లో బీహార్‌లో దాణా కుంభకోణం కేసు చోటుచేసుకుంది.
ఈ కేసులో లాలూకు సీబీఐ కోర్టు ఐదేళ్ల శిక్షతోపాటు రూ. 60 లక్షల జరిమానా విధించింది. డోరండ ట్రెజరీ నుంచి రూ. 139.5 కోట్లను చట్ట విరుద్ధంగా విత్ డ్రా చేశారనే ఆరోపణల నేపథ్యంలో సీబీఐ కోర్టు శిక్ష విధించింది. ఇదిలా ఉండగా..ఈ కేసులో ఐదేళ్ల పాటు శిక్ష పడిన లాలూ ఇప్పటికే 42 నెలలు జైలులో గడిపారు.
ఇది చదవండి: బ్రిటన్ ప్రధానితో విదేశాంగ మంత్రి భేటీ
Comments
Please login to add a commentAdd a comment