లాండ్‌ ఫర్‌ జాబ్‌ స్కాంలో లాలూకు షాక్‌ | ED supplementary chargesheet on Lalu Tejashwi accused alleged scam | Sakshi
Sakshi News home page

లాండ్‌ ఫర్‌ జాబ్‌ స్కాంలో లాలూకు షాక్‌

Published Tue, Aug 6 2024 3:04 PM | Last Updated on Tue, Aug 6 2024 3:43 PM

ED supplementary chargesheet on Lalu Tejashwi accused alleged scam

ఢిల్లీ: ల్యాండ్‌ ఫర్‌ జాబ్‌ స్కామ్‌ కేసులో ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు మరో షాక్‌ తగిలింది. లాలూతో పాటు ఆయన తనయుడు తేజస్వి, మరో ఎనిమిది మందిపై ఈ కేసులో సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ దాఖలైంది. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రౌస్‌ అవెన్యూ కోర్టులో 96 పేజీల డాక్యుమెంట్లను సమర్పించింది. 

ఢిల్లీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే  ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌పై ఆగస్టు 13న వాదనలు వినిపించేందుకు లిస్ట్ చేశారు.

కాగా, జనవరిలో సైతం ఈడీ బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, ఆమె కుమార్తెలు ఎంపీ మిసా భారతి, హేమా యాదవ్‌తో పాటు వ్యాపారవేత్త అమిత్ కత్యాల్, మాజీ రైల్వే ఉద్యోగి హృదయానంద్ చౌదరిలను నిందితులుగా పేర్కొంటూ ఈడీ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన విషయం  తెలిసిందే. 2004 నుంచి 2009 వరకు లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో పలువురు అభ్యర్థుల వద్ద భూమిని లంచంగా తీసుకొని రైల్వే ఉద్యోగాల ఇప్పించారనే ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈ కేసులో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement