
తేజ్ ప్రతాప్ యాదవ్, ఐశ్వర్య
రాంచీ/పట్నా: రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక వాద్రా హాజరు కానున్నారు. పెళ్లికి రాష్ట్రపతి కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ తదితరులను ఆహ్వానించారు. తేజ్ ప్రతాప్æ వివాహం ఆర్జేడీ ఎమ్మెల్యే చంద్రికా రాయ్ కుమార్తె ఐశ్వర్యతో శనివారం జరగనుంది.
లాలూకు 6 వారాల బెయిల్
దాణా స్కాంలో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూకు 6 వారాల తాత్కాలిక బెయిల్ మంజూరైంది. ఆయన అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ మంజూరు చేస్తూ జార్ఖండ్ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. మూడు రోజుల పెరోల్‌పై బయటకు వచ్చిన లాలూ గురువారం సాయంత్రం పట్నా చేరుకున్నారు.
లాలూకు రాందేవ్ ఆరోగ్య సూచనలు
బిహార్‌లోని నలంద, గయా జిల్లాల్లో మంగళవారం నుంచి యోగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్న యోగా గురువు బాబా రాందేవ్ శుక్రవారం లాలూ నివాసంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకునేందుకు నిత్యం యోగా చేయాలని లాలూకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment