సాక్షి, న్యూఢిల్లీ : బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో మెదడువాపు వ్యాధితో చిన్నారుల మరణాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాత్రి ఎంపీలకు ఇచ్చే విందును తమ పార్టీ బహిష్కరిస్తుందని ఆర్జేడీ నేత మిసా భారతి పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యులకు ఇచ్చే డిన్నర్ ఖర్చుతో ప్రభుత్వం చిన్నారులకు వైద్యం అందించేందుకు అవసరమైన మందులు, వైద్య పరికరాలు కొనుగోలు చేయవచ్చని ఆ పార్టీ నేత, ఆర్జేడీ చీప్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి అన్నారు.
కాగా, ముజఫర్‌పూర్‌లో మెదడువాపు వ్యాధితో ఇప్పటివరకూ 140 మంది చిన్నారులు మరణించడం కలకలం రేపుతోంది. చిన్నారులు చికిత్స పొందుతున్న శ్రీకృష్ణ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిని సందర్శించిన బిహార్ సీఎం నితీష్ కుమార్ ఆస్పత్రిని 2500 పడకల ఆస్పత్రిగా మార్చాలని ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రిలో తక్షణమే 1500 నూతన పడకలను ఏర్పాటు చేయాలని ఆస్పత్రిలో చేరిన వారి బంధువులు, కుటుంబ సభ్యుల కోసం ధర్మశాలను నిర్మించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment