లాలూ కూతురా..! మజాకా..! | Lalu Prasad Yadav's daughter Misa Bharti hires two IITians to manage her campaign | Sakshi
Sakshi News home page

లాలూ కూతురా..! మజాకా..!

Published Sat, Apr 5 2014 1:33 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

లాలూ కూతురా..! మజాకా..! - Sakshi

లాలూ కూతురా..! మజాకా..!

ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి తన ఎన్నికల ప్రచార బాధ్యతల నిర్వహణ కోసం ఏకంగా ఇద్దరు ఐఐటీ పట్టభద్రులను నియమించుకున్నారు. వైద్యురాలైన మీసా భర్త శైలేశ్‌కుమార్ ఐటీ నిపుణుడు. ఆయన తెరవెనుక పాత్ర పోషిస్తుండగా, సోషల్ మీడియా ద్వారా యువతరం ఓట్లను ఆకట్టుకునే పని చేపట్టేందుకు పంకజ్ సుదాన్, పర్వీన్ త్యాగి అనే ఐఐటీ పట్టభద్రులను నియమించుకున్నారు. బీహార్ రాజధాని పాట్నా  పరిధిలోని పాటలీపుత్ర లోక్‌సభ నియోజకవర్గం నుంచి మీసా ఈ ఎన్నికల్లో అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే.
 
 
 సోషల్ మీడియా ప్రచార బాధ్యతలను నిర్వర్తిస్తుండటంతో పాటు ప్రచార నిర్వహణపై ఐఐటీ నిపుణులిద్దరూ ఆమెకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మరోవైపు న్యూయార్క్‌కు చెందిన జమీల్ అక్తర్ అనే వైద్యుడు ఎన్నికల ప్రచార సభల్లో మీసా చేసే ప్రసంగాలకు తుది మెరుగులు దిద్దే పనిలో తలమునకలవుతున్నారు. ఆజాద్‌కుమార్ అనే మరోవైద్యుడు గ్రామీణ ఓటర్ల నాడిని పసిగట్టి, అందుకు అనుగుణంగా ఎన్నికల వ్యూహంలో చేసుకోవలసిన మార్పులపై మీసాకు సలహాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement