మిసా భారతికి రూ.10 వేల జరిమానా | Misa Bharti was fined Rs 10,000 | Sakshi
Sakshi News home page

మిసా భారతికి రూ.10 వేల జరిమానా

Published Wed, Jun 7 2017 1:33 AM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM

మిసా భారతికి రూ.10 వేల జరిమానా - Sakshi

మిసా భారతికి రూ.10 వేల జరిమానా

న్యూఢిల్లీ: లాలుప్రసాద్‌ కుమార్తె, ఎంపీ మిసా భారతికి ఆదాయపు పన్ను శాఖ మంగళవారం రూ.10 వేల జరిమానా విధించింది. రూ.1000 కోట్ల బినామీ భూములు, పన్ను ఎగవేత కేసులో ఆమె మంగళవారం ఐటీ అధికారుల ముందు హాజరుకావాల్సి ఉంది. సమన్లను ఉల్లంఘించినందుకు ఈ మేరకు చర్యలు తీసుకుంది.

జూన్‌ 12న తమ ఎదుట హాజరుకావాలని మరోసారి సమన్లు జారీ చేసింది. వ్యక్తిగత హాజరు నుంచి మిసా భారతికి మినహాయింపు ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాది ఐటీ అధికారులను కోరారు. అయితే దీనికి తగిన కారణం తెలియజేయకపోవడంతో అధికారులు న్యాయవాది అభ్యర్థనను తిరస్కరించారు. లాలూ కుమార్తె, అల్లుడు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో మే 22న ఆదాయపుపన్ను శాఖ అధికారులు వారి నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరిపిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement