కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్‌పై ఇటీవల లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీనిపైన రాష్ట్రంలో రాజకీయ నేతలు ధ్వజమెత్తారు. ఈ తరుణంలో ఆర్జేడీ నేత మిసా భారతి కూడా స్పందించారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
పశ్చిమ బెంగాల్ గవర్నర్‌పై వచ్చిన అభియోగం ఆందోళన కలిగించే విషయం. ఈ విషయంలో సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని మిసా భారతి అన్నారు. ఈమె పాట్లీపుత్ర లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు.
ఈ విషయం మీద తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా స్పందించారు. రాజ్‌భవన్‌లో పనిచేసిన ఓ యువతి బయటకు వచ్చి గవర్నర్ వేధింపులకు వ్యతిరేకంగా మాట్లాడింది. ఆ మహిళ కన్నీళ్లకు నా గుండె పగిలింది. సందేశ్‌ఖలీ గురించి మాట్లాడే ముందు బీజేపీ దీనికి సమాధానం చెప్పాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment