రైస్‌మిల్లు వద్ద విచారిస్తున్న సీఐడీ డీఎస్పీ రవికుమార్
సాక్షి, వరంగల్: మండల కేంద్రంలోని ఓ రైస్‌మిల్లుపై గతేడాది నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ (ఎస్‌సీఎస్)కు బాధితురాలు ధరావత్ శకుంతల ఫిర్యాదు చేయగా విచారణ అధికారిగా కమిషన్ సీఐడీ డీఎస్పీ రవికుమార్‌ను నియమించింది. ఈ మేరకు బుధవారం డీఎస్పీ రవికుమార్ రైస్‌మిల్లు వద్దకు వచ్చి ఫిర్యాదు చేసిన వారితో పాటు ప్రస్తుతం నిర్వహిస్తున్న వారిని విచారించారు. 2010లో ధరావత్ శకుంతల ఎస్సీ, ఎస్టీ ఎంటర్‌ప్రైజెస్ పథకంలో రూ.50 లక్షల సబ్సిడీతో రూ.3 కోట్లతో రైస్‌మిల్లు పొంది రూ.1.93 కోట్ల పెట్టుబడితో రైస్‌మిల్లు ఏర్పాటు చేసుకున్నారు.
రూ.89,50 లక్షలు కెనరా బ్యాంక్ రుణం అందజేయగా.. ప్రభుత్వం నుంచి రూ.40 లక్షల సబ్సిడీ విడుదల చేసింది. ప్రతినెలా 1.29 లక్షలు బ్యాంక్ అప్పు చెల్లించే విధంగా ప్రీమియం ఏర్పాటు చేసుకోగా ప్రతినెలా ప్రీమియం చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు మిల్లును వేలం వేసి అమ్మేశారు. దీనిపై ధరావత్ శకుంతల మిల్లును వేలం వేసి తనకు నష్టం చేశారంటూ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. రాష్ట్రస్థాయి నుంచి ఆ ఫిర్యాదుపై నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్‌్సకు బదిలీ చేసింది. దీనిపై సీఐడీ డీఎస్పీ రవికుమార్‌ను విచారణ అధికారిగా నియమించగా బుధవారం రైస్‌మిల్లు వద్ద విచారించారు.
Comments
Please login to add a commentAdd a comment