Lingalaghanapuram
-
మహిళ ఫిర్యాదుతో సీఐడీ విచారణ
సాక్షి, వరంగల్: మండల కేంద్రంలోని ఓ రైస్‌మిల్లుపై గతేడాది నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ (ఎస్సీఎస్)కు బాధితురాలు ధరావత్ శకుంతల ఫిర్యాదు చేయగా విచారణ అధికారిగా కమిషన్ సీఐడీ డీఎస్పీ రవికుమార్‌ను నియమించింది. ఈ మేరకు బుధవారం డీఎస్పీ రవికుమార్ రైస్‌మిల్లు వద్దకు వచ్చి ఫిర్యాదు చేసిన వారితో పాటు ప్రస్తుతం నిర్వహిస్తున్న వారిని విచారించారు. 2010లో ధరావత్ శకుంతల ఎస్సీ, ఎస్టీ ఎంటర్ప్రైజెస్ పథకంలో రూ.50 లక్షల సబ్సిడీతో రూ.3 కోట్లతో రైస్‌మిల్లు పొంది రూ.1.93 కోట్ల పెట్టుబడితో రైస్‌మిల్లు ఏర్పాటు చేసుకున్నారు. రూ.89,50 లక్షలు కెనరా బ్యాంక్ రుణం అందజేయగా.. ప్రభుత్వం నుంచి రూ.40 లక్షల సబ్సిడీ విడుదల చేసింది. ప్రతినెలా 1.29 లక్షలు బ్యాంక్ అప్పు చెల్లించే విధంగా ప్రీమియం ఏర్పాటు చేసుకోగా ప్రతినెలా ప్రీమియం చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు మిల్లును వేలం వేసి అమ్మేశారు. దీనిపై ధరావత్ శకుంతల మిల్లును వేలం వేసి తనకు నష్టం చేశారంటూ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. రాష్ట్రస్థాయి నుంచి ఆ ఫిర్యాదుపై నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్‌్సకు బదిలీ చేసింది. దీనిపై సీఐడీ డీఎస్పీ రవికుమార్‌ను విచారణ అధికారిగా నియమించగా బుధవారం రైస్‌మిల్లు వద్ద విచారించారు. -
పొలం పనికి వెళ్లి.. విగతజీవిగా మారాడు
సాక్షి, లింగాలఘణపురం(వరంగల్) : అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలోని నాగారంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజశేఖర్‌రెడ్డి(30) సోమవారం తన సోదరుడైన దుంబాల భాస్కర్‌రెడ్డి వ్యవసాయ బావి వద్ద నాటు వేస్తుండగా అక్కడికి వెళ్లి సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చి అనంతరం రాత్రి చీకటి పడే సమయంలో తన స్వంత వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి పనులు చూసుకొని ఇంటికి చేరుకున్నాడు. తల్లిని భోజనం పెట్టాలని కోరగా ఇంకా వంట చేస్తున్నానని తాను సమాధానం చెప్పింది. ఈలోగా రాజశేఖర్‌రెడ్డి ఇంటి వెనుకాల నుంచే బయటకు వెళ్లాడు. రాత్రి ఇంటికి రాలేదు. ఉదయం అటు వైపుగా వెళ్తున్న గ్రామస్తులు రోడ్డుపై పడిపోయి ఉన్న రాజశేఖర్‌రెడ్డిని చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. దీంతో గ్రామస్తులు ఎస్సై రవీందర్‌కు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై మృతదేహాన్ని పరిశీలించి ముక్కులోంచి రక్తం, నోటినుంచి నురగలు వచ్చినట్లుగా గుర్తించారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినాడా.. లేదా ఏదైనా విష పురుగు కరిచి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై రవీందర్ తెలిపారు. గ్రామంలో విషాదం గ్రామంలో అందరితో కలివిడిగా ఉండే యువకుడు రాజశేఖర్‌రెడ్డి మృతి చెందడంతో గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. రాజశేఖర్‌రెడ్డి తల్లి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో కొడుకు చనిపోయాడనే ధ్యాస కూడ లేకపోవడం, తండ్రి ఇంటి వద్ద ఉండకుండా హైదరాబాద్, జనగామల్లో హోటల్లో పని చేస్తుండడంతో కొడుకు చనిపోయిన విషయాన్ని తెలియజేసేందుకు అతడి కోసం వెతికారు. రాజశేఖర్‌రెడ్డి కుటుంబ పరిస్థితి ఇలా ఉండడంతో గ్రామస్తులంతా విచారం వ్యక్తం చేస్తున్నారు. -
నీళ్లులేని నిమజ్జనం
* అంతటా జోరువానలు.. * లింగాలఘణపురంలో నీరు కరువు లింగాలఘణపురం: కుండపోత.. భారీ వర్షాలు.. నిండిన కుంటలు... అలుగు పోస్తున్న చెరువులు... రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఇలా ఉంటే.. వరంగల్ జిల్లా లింగాలఘణపురంలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. మండల కేంద్రంలోని పాత చెరువులో వరుసగా మూడేళ్ల నుంచి చుక్కనీరు రావడం లేదు. దీంతో గతేడాది నిమజ్జనం చేసిన వినాయక విగ్రహాలు నేటికీ అలాగే దర్శనమిస్తున్నారుు. ఇక ఈ ఏడాది కూడా తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న గణనాథులను స్థాని కులు మట్టిలోనే నిమజ్జనం చేస్తున్నారు. వరుస కరువుతో తాగేందుకు కూడా నీరు లేక ట్యాంకర్లతో తెచ్చుకుంటున్నారు. ఇక పంటల పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉంది. ఈ చెరువులోకి నీరు వచ్చే అశ్వరావుపల్లి రిజర్వాయర్ కాల్వలు అసంపూర్తిగా ఉండడంతో నీరు రావడం లేదని స్థానికులు అంటున్నారు. అధికారులు, పాలకులు ఇప్పటికై నా స్పందించాలని వారు కోరుతున్నారు.