నీళ్లులేని నిమజ్జనం
* అంతటా జోరువానలు..
* లింగాలఘణపురంలో నీరు కరువు
లింగాలఘణపురం: కుండపోత.. భారీ వర్షాలు.. నిండిన కుంటలు... అలుగు పోస్తున్న చెరువులు... రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఇలా ఉంటే.. వరంగల్ జిల్లా లింగాలఘణపురంలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. మండల కేంద్రంలోని పాత చెరువులో వరుసగా మూడేళ్ల నుంచి చుక్కనీరు రావడం లేదు. దీంతో గతేడాది నిమజ్జనం చేసిన వినాయక విగ్రహాలు నేటికీ అలాగే దర్శనమిస్తున్నారుు. ఇక ఈ ఏడాది కూడా తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న గణనాథులను స్థాని కులు మట్టిలోనే నిమజ్జనం చేస్తున్నారు. వరుస కరువుతో తాగేందుకు కూడా నీరు లేక ట్యాంకర్లతో తెచ్చుకుంటున్నారు.
ఇక పంటల పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉంది. ఈ చెరువులోకి నీరు వచ్చే అశ్వరావుపల్లి రిజర్వాయర్ కాల్వలు అసంపూర్తిగా ఉండడంతో నీరు రావడం లేదని స్థానికులు అంటున్నారు. అధికారులు, పాలకులు ఇప్పటికై నా స్పందించాలని వారు కోరుతున్నారు.