ganesh status
-
నీళ్లులేని నిమజ్జనం
* అంతటా జోరువానలు.. * లింగాలఘణపురంలో నీరు కరువు లింగాలఘణపురం: కుండపోత.. భారీ వర్షాలు.. నిండిన కుంటలు... అలుగు పోస్తున్న చెరువులు... రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఇలా ఉంటే.. వరంగల్ జిల్లా లింగాలఘణపురంలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. మండల కేంద్రంలోని పాత చెరువులో వరుసగా మూడేళ్ల నుంచి చుక్కనీరు రావడం లేదు. దీంతో గతేడాది నిమజ్జనం చేసిన వినాయక విగ్రహాలు నేటికీ అలాగే దర్శనమిస్తున్నారుు. ఇక ఈ ఏడాది కూడా తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న గణనాథులను స్థాని కులు మట్టిలోనే నిమజ్జనం చేస్తున్నారు. వరుస కరువుతో తాగేందుకు కూడా నీరు లేక ట్యాంకర్లతో తెచ్చుకుంటున్నారు. ఇక పంటల పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉంది. ఈ చెరువులోకి నీరు వచ్చే అశ్వరావుపల్లి రిజర్వాయర్ కాల్వలు అసంపూర్తిగా ఉండడంతో నీరు రావడం లేదని స్థానికులు అంటున్నారు. అధికారులు, పాలకులు ఇప్పటికై నా స్పందించాలని వారు కోరుతున్నారు. -
ఆకట్టుకుంటున్న ప్రొకబడ్డీ గణేశ్‌లు
హైదరాబాద్: నగరంలోని భక్తులను ప్రొ కబడ్డీ గణేశ్‌లు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వెస్ట్ మారేడుపల్లి నెహ్రూనగర్ పార్కు వద్ద ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ గణేశ్ విగ్రహాలను చూసేందుకు భక్తులు అసక్తి చూపుతున్నారు. తెలుగు టైటన్స్, పాట్నా పైరేట్స్ టీమ్‌ల మద్య జరిగిన ఫైనల్ పోరును గణేశ్ రూపంలో విగ్రహాలను ఏర్పాటు చేశారు. కబడ్డీ కోర్టులో రెండు వైపులా ఒకొక్క టీమ్ లో ఏడుగురు క్రీడాకారులను ఏర్పాటు చేశారు. మధ్యలో రిఫరీగా శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ వినాయక విగ్రహాలను దర్శించుకునేందుకు నగరవాసులు బారులు కడుతున్నారు. ప్రతి సంవత్సరం కొత్తదనంతో గణేశ్ విగ్రహాలు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఫ్రెండ్స్ యూత్ అసోషియేషన్ సభ్యులు నిఖిల్, వివేక్, ప్రశాంత్ వెల్లడించారు.