దుబ్బాక, న్యూస్‌లైన్:
వినాయక నిమజ్జనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. వినాయకుని విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు చెరువులో దిగిన ఓ యువకుడు నీట మునిగి మృత్యువాత పడ్డాడు. ఈ సంఘన ఆదివారం దుబ్బాకలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు..అంబేద్కర్ యూత్ సభ్యుడు గోపి వెంకటేష్(18) ఆదివారం ఉదయం పెద్ద చెరువులో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు మిత్రులతో కలిసి వెళ్లాడు. అయితే నీరు లోతుగా ఉన్న వైపునకు వెళ్లిన వెంకటేష్ నీటమునిగిపోయాడు. గమనించిన మిత్రులు వెంటనే అతన్ని బయటకు తీశారు. హుటాహుటీన ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే వెంకటేష్ మృత్యువాత పడ్డాడు. మృతుని కుటుంబీకుల ఫిర్యాదు మేరకు దుబ్బాక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పట్టణంలో విషాదం
గ్రామానికి చెందిన గోపి రామకిష్టయ్య, అమృతవ్వలకు ముగ్గురు సంతానం. వీరిలో చిన్నవాడైన వెంకటేష్ ఇంటర్మీడియెట్ వరకు చదువుకుని, దుబ్బాకలోని ఓ దుకాణంలో పని చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం లాగే తన స్నేహితులతో కలిసి వినాయక నవరాత్రి ఉత్సోవాల్లో పాల్గొన్నాడు. శనివారం నిమజ్జనోత్సవ ంలో ఆడుతూపాడుతూ కనిపించిన వెంకటేష్ గంటల వ్యవధిలోనే మృతి చెందడంతో పట్టణంలో విషాదం నెలకొంది. కుమారుడి మృతి వార్తను తెలుసుకున్న తల్లిదండ్రులు, సోదరుడు నరేష్‌లు ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు.
వినాయక నిమజ్జంలో అపశ్రుతి
Published Mon, Sep 23 2013 12:08 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM
Advertisement