
ఒకే కుటుంబం నుంచి బరిలో ఉన్న నలుగురు అభ్యర్థులు
విజయనగరం,పూసపాటిరేగ: మండలంలోని వెంపడాం పంచాయతీ తాళ్లపేట గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు ఎంపీటీసీ స్థానానికి మూడు నామినేషన్లు వేశారు. జెడ్పీటీసీ స్థానానికి నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. తాళ్లపేట గ్రామానికి చెందిన కంది రామునాయుడు పతివాడ ఎంపీటీసీ స్థానానికి, ఆయన కుమారుడు కంది నాగేశ్వరరావు వెంపడాం ఎంపీటీసీ స్థానానికి, నాగేశ్వరరావు భార్య కంది లక్ష్మి పసుపాం ఎంపీటీసీ స్థానానికి బీజేపీ తరఫున నామినేషన్లు దాఖలు చేశారు. అదే కుటుంబానికి చెందిన కంది సరస్వతి బీజేపీ తరఫున పూసపాటిరేగ మండల జెడ్పీటీసీగా బుధవారం నామినేషన్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఒకే కుటుంబం నుంచి నలుగురు ఎన్నికల్లో పోటీచేయడానికి సిద్ధం కావడం చర్చనీయాంశంగా మారింది.