లెక్కల్లో అభ్యర్థులు!
లెక్కల్లో అభ్యర్థులు!
Published Tue, Apr 8 2014 3:59 AM | Last Updated on Sat, Sep 2 2017 5:42 AM
తెర్లాం రూరల్/సీతానగరం, న్యూస్‌లైన్ : ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఆదివారం పోలిం గ్ జరగడంతో ప్రధాన రాజకీయ పార్టీల నా యకులు, కార్యకర్తలు విజయావకాశాలపై బేరీజు వేసుకుంటున్నారు. తెర్లాం మండలం లో 17 ఎంపీటీసీ స్థానాలు, ఒక జెడ్పీటీసీ స్థానం ఉంది. అన్నిచోట్లా వైఎస్సార్ సీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నెలకొంది. కుసుమూరు, కూనాయవలస, లోచర్ల, నందబలగ స్థానాల్లో వైఎస్సార్ సీపీ, టీడీపీతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా నువ్వా.. నేనా అన్నట్టు పోటీ పడ్డారు. నంది గాం, వెలగవలస స్థానాల్లో ప్రధాన పార్టీలైన వైఎ స్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటీ చేశారు. మండలంలో మొత్తం 45, 768 మంది ఓటర్లు ఉండగా, ఆదివారం జరిగిన ఎన్నికల్లో 37, 740 ఓట్లు పోలయ్యాయి.
పోలింగ్ శాతాన్ని బట్టి గెలుపోటములపై ప్రధాన పార్టీల నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. గెలుపోటము లపై వైఎస్సార్ సీపీ, టీడీపీ నేతలు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. 17 ఎంపీటీసీ స్థానా ల్లో వైఎస్సార్ సీపీ అధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని, ఎంపీపీ పీఠాన్ని తామే కైవసం చేసుకుం టామని ఆపార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నాయకులు కూడా ఇదే ధీమా తో ఉన్నారు. తెర్లాం ఎంపీపీ స్థానం ఈసారి అన్ రిజర్వడ్ మహిళకు కేటాయించారు. అయితే మండలంలో వైఎస్సార్ సీపీ అధికంగా ఎంపీటీసీ స్థానాల ను కైవసం చేసుకొని ఎంపీపీ పీఠాన్ని చేజిక్కుంచుకునే అవకాశం ఉందని పరి శీలకులు చెబుతున్నారు. జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి వైఎస్సార్ సీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్య గట్టి పోటీ జరిగింది.
ఈ స్థానాన్ని కూడా వైఎస్సార్ సీపీ కైవసం చేసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సీతానగరం మండలంలో మొత్తం 43,073 మంది ఓటర్లు ఉండగా..ఆదివారం జరిగిన పోలింగ్‌లో 35,749 మంది ఓ టుహక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ 17 ఎంపీటీసీ స్థానాల్లో నిడగల్లులో వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవమైంది. దీంతో మిగతా 16 స్థానాలకు ఆదివారం ఎన్నిక జరిగింది. అరుు తే పోలింగ్ సరళిని బట్టి కృష్ణారాయపురం, గా దెలవలస, దయానిధిపురం, లచ్చయ్యపేట, చినభోగిలి, ఆర్. వెంకంపేట,తామరకండి, గెడ్డలుప్పి, గుచ్చిమి, వెంకటాపురం స్థానా లతో పాటు మిగతా చోట కూడా వైఎ స్సార్ సీపీ కైవసం చేసుకునే అవకా శం ఉందని పలువురు భావిస్తున్నా రు. జెడ్పీటీసీ స్థానానికి కూడా ఈ రెండు పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది.
Advertisement