ప్రమాణం చేస్తున్న నారాయణరావు
లావేరు: తండ్రి చనిపోయి కుటుంబంలో విషాదం నెలకొన్న సమయంలో ఓ ఎంపీటీసీ సభ్యుడు ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది. తండ్రి లేడన్న బాధను పంటి బిగువన భరిస్తూ.. నీళ్లు నిండిన కళ్లతోనే ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తామాడలో రౌతు నారాయణరావు ఎంపీటీసీగా గెలుపొందారు. శుక్రవారం ఆయన ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. కానీ అదే రోజు ఆయన తండ్రి పాపినాయుడు అనారోగ్యంతో మరణించారు. దీంతో తండ్రి అంత్యక్రియలు పూర్తి చేసి మండల పరిషత్ కార్యాలయానికి వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు.
చదవండి: తెలంగాణ పర్వతారోహకుడికి సీఎం జగన్ భారీ ఆర్థిక సహాయం
Comments
Please login to add a commentAdd a comment