స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జిల్లాలోని 25 మండల పరిషత్‌లకు గాను 14 మండల పరిషత్ అధ్యక్ష స్థానాలు మహిళలకు రిజర్వు అయ్యాయి. 13 మండలాల జెడ్పీటీసీ స్థానాలనూ మహిళలకు కేటాయించారు. ఈ రిజర్వేషన్ల ప్రక్రియపై అధికార యంత్రాంగం రెండు, మూడు రోజులుగా కసరత్తు చేసింది. జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు వివరాలను ప్రకటించారు.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మండల పరిషత్ అధ్యక్ష స్థానాలు, జెడ్పీసీటీ స్థానాల రిజర్వేషన్లను గురువారం జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు ప్రకటించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మహిళల రిజర్వేషన్లను లక్కీడ్రా ద్వారా ఎంపిక చేశారు. మండల పరిషత్‌లకు సంబంధించి 25 స్థానాల్లో బీసీలకు ఐదు ఎంపీపీలు,ఎస్సీలకు నాలుగు, ఎస్టీలకు మూడు రిజ ర్వు అయ్యాయి. 13 ఎంపీపీ స్థానాలు జనరల్ అయ్యాయి. ఆయా కేటగిరిల్లో మహిళలకు 14 స్థానాలు వచ్చాయి.
బీసీలకు ఆరు జెడ్పీటీసీ స్థానాలు..
ఆయా మండలాల జెడ్పీటీసీ స్థానాల రిజ ర్వేషన్ల వివరాలను పరిశీలిస్తే.. ఆరు జెడ్పీటీసీలు బీసీలకు రిజర్వు అయ్యాయి. అలా గే ఎస్సీలకు నాలుగు స్థానాలు, ఎస్టీలకు రెండు జెడ్పీటీసీలు కేటాయించగా, 13 స్థానాలు జనరల్‌కు వచ్చాయి. రిజర్వేషన్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిం చినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. వచ్చే పార్లమెంటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జెడ్పీ సీఈవో వేణు, డిప్యూటీ సీఈవో గోవింద్, డీపీవో కృష్ణమూర్తి, రాజకీయ పార్టీల ప్రతినిధులు, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ నేతలు తజ్‌ముల్, హజ్రాబేగం, కాంగ్రెస్ నుంచి శివకుమార్, బీజేపీకి చెందిన గంగాకిషన్ పాల్గొన్నారు.
మండలం | ఎంపీపీ రిజర్వేషన్ | జెడ్పీటీసీ రిజర్వేషన్ |
ఆర్మూర్ | ఎస్సీ | ఎస్సీ |
బాల్కొండ | బీసీ | బీసీ (మహిళ) |
భీంగల్ | జనరల్ | బీసీ |
బోధన్ | జనరల్ (మహిళ) | జనరల్ (మహిళ) |
ధర్పల్లి | జనరల్ (మహిళ) | జనరల్ |
డిచ్‌పల్లి | జనరల్ | జనరల్ (మహిళ) |
ఇందల్‌వాయి | ఎస్టీ | జనరల్ (మహిళ) |
జక్రాన్‌పల్లి | జనరల్ (మహిళ) | జనరల్ (మహిళ) |
కమ్మర్‌పల్లి | బీసీ (మహిళ) | బీసీ (మహిళ) |
కోటగిరి | జనరల్ (మహిళ) | జనరల్ |
మాక్లూర్ | జనరల్ | జనరల్ |
మెండోరా | ఎస్సీ (మహిళ) | ఎస్సీ |
మోర్తాడ్ | జనరల్ | జనరల్ |
మోపాల్ | ఎస్టీ (మహిళ) | ఎస్టీ (మహిళ) |
ముప్కాల్ | జనరల్ (మహిళ) | జనరల్ (మహిళ) |
నందిపేట | జనరల్ | జనరల్ (మహిళ) |
నవీపేట | ఎస్సీ | ఎస్సీ (మహిళ) |
నిజామాబాద్ | జనరల్ (మహిళ) | జనరల్ (మహిళ) |
రెంజల్ | బీసీ (మహిళ) | బీసీ (మహిళ) |
రుద్రూరు | బీసీ (మహిళ) | బీసీ |
సిరికొండ | ఎస్టీ (మహిళ) | ఎస్టీ |
వేల్పూరు | ఎస్సీ (మహిళ) | ఎస్సీ (మహిళ) |
వర్ని | జనరల్ (మహిళ) | జనరల్ |
ఎడపల్లి | బీసీ | బీసీ |
ఏర్గట్ల | జనరల్ | జనరల్ |
Comments
Please login to add a commentAdd a comment