804 మంది ఎంపీటీసీ సభ్యులకు ఓటు హక్కు | 804 mptcs have vote | Sakshi
Sakshi News home page

804 మంది ఎంపీటీసీ సభ్యులకు ఓటు హక్కు

Published Sun, Feb 19 2017 9:16 PM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM

804 mptcs have vote

కర్నూలు(అర్బన్‌): త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లాలో 804 మంది ఎంపీటీసీ సభ్యులు మాత్రమే ఓటు హక్కును కలిగి ఉన్నారు. మొత్తం 815 మంది ఎంపీటీసీ సభ్యులగాను 9 మంది మృతి చెందారు. వివిధ కారణాలతో ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు తమ ఓటు హక్కును కోల్పోయారు. దీంతో మిగిలిన 804 మంది ఎంపీటీసీ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.  ఓర్వకల్లు మండలం కన్నమడకల,  ప్యాపిలి మండలం ఊటకొండ, ప్యాపిలి–1, నందవరం–3, హాలహర్వి మండలం గూళ్యం –2, కోడుమూరు మండలం లద్దగిరి –2, ఆదోని మండలం కపటి, కోసిగి మండలం జుమాల్‌దిన్నె, కోసిగి–6 ఎంపీటీసీ సభ్యులు మృతి చెందారు. నంద్యాల పెద్ద కొట్టాల ఎంపీటీసీ ఎన్నిక జరగలేదు. వెలుగోడు ఎంపీటీసీ విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేయడంతో పదవి నుంచి తొలగించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement