రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఎంపిటిసి 2కు జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తమ స్థానాన్ని నిలబెట్టుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి రేశ్మసుల్తాన ఇండిపెండెంట్ అభ్యర్థి హశ్రసుల్తానా పై 17 ఓట్ల తేడాతో గెలుపొందింది. కాంగ్రెస్ అభ్యర్థికి 573 ఓట్లు రాగా స్వసంత్ర అభ్యర్థి 556 ఓట్లు సాధించారు. టిడిపి, బిజెపి మిత్రపక్షల అభ్యర్థిగా పోటి చేసిన సరిత కు 498 ఓఓట్లు పోలయ్యాయి. అదికార పార్టీ టిఆర్ఎస్ అభ్యర్థి ధీపామల్లేష్ మాత్రం 192 ఓట్లతో నాలుగో స్థానాని సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఈ స్థానంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి జులేఖబేగం ఆకస్మికంగా మృతి చెందడంతో ఆదికారులు ఉపఎన్నిక నిర్వహించారు. దీంతో ఎన్నికల్లో నాలుగు ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీ పడ్డారు. టీడీపీ నుంచి టికెట్ ఆశించి.. పొందలేక పోయిన.. మాజీ ఎంపీటీసీ జహింగీర్.. తన భార్య హశ్రసుల్తానాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలిపారు. అధికారపార్టీ అభ్యర్థిగా దీపామల్లేష్ పోటీ చేశారు. ఎన్నికల్లో మొత్తం 2430 ఓట్లు ఉండగా.. వీటిలో 1030 ఉండం.. మైనార్టీ వర్గానికే చెందిన ఇద్దరు బలమైన అభ్యర్థులు పోటీలో ఉండంతో ఎన్నిక సర్వత్రా ఉత్కంఠ కలిగించింది.
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకున్న కాంగ్రెస్
Published Tue, Dec 8 2015 3:13 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement