సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని చింతలపాలెం ఎంపీటీసీ దంపతులపై హత్యాయత్నం జరిగింది. చింతలపాలెం మండలం టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీటీసీ లకావత్ రామారావుపై మేళ్లచెరువులో కత్తితో దాడి చేశారు. అదే విధంగా రామారావు భార్య సుభద్రపై కూడా నిందితుడు దాడికి దిగాడు.
ఈ దాడితో దంపతులకు తీవ్ర గాయాలు కాగా.. వారిని ఆసుపత్రికి తరలిచించి చికిత్స అందిస్తున్నారు. పాతకక్ష్యలే దాడికి కారణంగా చెబుతున్నారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు .
Comments
Please login to add a commentAdd a comment