
తుంగతుర్తి: నిరుద్యోగులకు ఇస్తామన్న భృతి ఏమైందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర మంగళవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లికి చేరుకుంది. గ్రామంలో పాదయాత్ర చేస్తూ రైతులు, వ్యవసాయ కూలీలు, వృద్ధులను పలకరించారు.
అనంతరం బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన నిరుద్యోగ నిరాహార దీక్షలో ఆమె రోజంతా కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిరుద్యోగుల పక్షాన దీక్ష చేస్తే గానీ ప్రభుత్వానికి బుద్ధి రాలేదన్నారు. రాష్ట్రంలో 3లక్షల 90వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, పీఆర్సీ నివేదిక చెబుతున్నా..బిస్వాల్ కమిటీ చెప్పినా ప్రభుత్వం 89వేల ఉద్యోగాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయని ప్రకటించిందని, ఈ లెక్క ఎవరిచ్చారని ప్రశ్నించారు. 2018 ఎన్నికల్లో నిరుద్యోగ భృతి రూ.3,116 ఇస్తామని చెప్పి 40 నెలలు గడుస్తున్నా ఎందుకు అమలు చేయడం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment