సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంపీటీసీ స్థానాల లెక్క కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. గతంలోని ఎంపీటీసీ స్థానాలతో పోలిస్తే ఇప్పుడు 493 స్థానాలు తగ్గనున్నాయి. 3,500 జనాభా ప్రాతిపదికన ఎంపీటీసీ స్థానాలు పునర్విభజన చేశారు. ఉమ్మడి 9 జిల్లా ల పరిధిలో మొత్తం 6,473 ఎంపీటీసీ స్థానాలుండగా ఇప్పుడు 5,977కి తగ్గనున్నట్లు సమాచారం. కొత్త జిల్లాల ప్రాతిపదికన మొత్తం 535 జడ్పీటీసీ స్థానాలు ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. ఈ మేర కు సోమవారం ముసాయిదా ప్రతిపాదనలను పంచాయతీరాజ్ శాఖ ప్రభుత్వానికి సమర్పించనుంది. రాష్ట్రంలో కొత్తగా 68 మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి.
పట్టణ స్వరూప మున్న మండల కేంద్రాలను మున్సిపాలిటీలుగా మార్చడంతో ఎంపీటీసీ స్థానాల సంఖ్య తగ్గింది. మార్చి 30న పంచాయతీవార్డులవారీగా ఓటర్ల జాబితాలు సిద్ధమవుతాయి. ఆ తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు ఖరారవుతాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంపీటీసీ నియోజకవర్గాల సంఖ్య అత్యధికంగా 98 పెరిగాయి. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 89 ఎంపీటీసీ స్థానాలు తగ్గిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment