
సాక్షి, హైదరాబాద్: రెండో విడత పరిషత్ ఎన్నికల్లో భాగంగా మొత్తం 14,670 నామినేషన్లు దాఖల య్యాయి. ఈ విడతలో ఎన్నికలు జరగనున్న 180 జెడ్పీటీసీ స్థానాలకు 2,008 నామినేషన్లు, 1,913 ఎంపీటీసీ సీట్లలో 12,552 నామినేషన్లు సమర్పించారు. తిరస్కరణకు గురైన నామినేషన్లకు సంబం ధించి మంగళవారం జెడ్పీటీసీ అభ్యర్థులపై కలెక్టర్లు, ఎంపీటీసీ అభ్యర్థులపై ఆర్డీఓలు, సబ్ కలెక్టర్లు అప్పీళ్లను స్వీకరించిన నేపథ్యంలో బుధవారం సాయం త్రం 5 గంటలలోగా వాటిని పరిష్కరిస్తారు. మే 2న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చి, సాయంత్రం 3 గంటల తర్వా త పోటీచేసే అభ్యర్థుల తుది జాబితా విడుదల చేస్తారు.ఈనెల 10న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయి.
పార్టీల వారీగా నామినేషన్లు...
ఈ విడతలో 180 జెడ్పీటీసీ స్థానాల్లో: టీఆర్‌ఎస్ నుంచి 525, కాంగ్రెస్ నుంచి 482, బీజేపీ నుంచి 231, టీడీపీ నుంచి 82, సీపీఎం నుంచి 33, సీపీఐ నుంచి 27, ఎంఐఎం నుంచి 3, గుర్తింపు పొందిన ఇతర పార్టీల నుంచి 61, ఇండిపెండెంట్లు 213 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు.
ఎంపీటీసీ స్థానాల్లో: టీఆర్‌ఎస్ నుంచి 4,214, కాంగ్రెస్ నుంచి 3,175, బీజేపీ నుంచి 1,289, టీడీపీ నుంచి 266, సీపీఎం నుంచి 171, సీపీఐ నుంచి 114, ఎంఐఎం నుంచి 6, వైసీపీ నుంచి 1, గుర్తింపు పొందిన ఇతర పార్టీల నుంచి 137, ఇండిపెండెంట్లు 1,533 మంది నామినేషన్లు వేశారు.
Comments
Please login to add a commentAdd a comment