
సాక్షి, మహబూబ్ నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకుర్ గ్రామంలో బీజేపీ కార్యకర్త ప్రేమ్ కుమార్ దారుణ హత్యకు గురయ్యాడు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు తరువాత, గెలిచిన బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి మంగళవారం గ్రామంలో విజయోత్సవ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
టీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన దాడిలో బీజేపీ కార్యకర్త ప్రేమ్ కుమార్ తీవ్రంగా గాయపడగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతు ప్రేమ్ కుమార్ మృతి చెందాడు. ఈ ఘటనపై బాధితుడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment