కాలె జయమ్మ, దుర్గాభవాని, శ్రీకాంత్
నవాబుపేట/మొయినాబాద్ రూరల్: చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కుటుంబానికి అదృష్టం బాగానే కలిసి వచ్చింది. ఆయన భార్య, కుమారుడు జెడ్పీటీసీలుగా, కోడలు ఎంపీటీసీగా విజయం సాధించారు. నవాబుపేట మండలం చించల్‌పేట గ్రామానికి చెందిన యాదయ్య పేద కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. పీఏసీఎస్ డైరెక్టర్‌గా అడుగుపెట్టిన ఆయనకు అవకాశాలు కలిసి వచ్చాయి. సొసైటీ డైరెక్టర్ నుంచి సింగిల్ విండో చైర్మన్‌గా, అనంతరం ఎంపీపీ, జెడ్పీటీసీగా పనిచేశారు. ఆ తర్వాత వైఎస్సార్ హయాంలో టీటీడీ బోర్డు మెంబర్‌గా వ్యవహరించారు.
గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి చేవెళ్ల నుంచి గెలుపొందారు. యాదయ్య ప్రాదేశిక ఎన్నికల బరిలో తన భార్య కాలె జయమ్మ నవాబుపేట జెడ్పీటీసీగా విజయం సాధించారు. మొయినాబాద్ జెడ్పీటీసీగా కొడుకు శ్రీకాంత్ గెలిచారు. ఆయన రెండో కోడలు దుర్గాభవాని నవాబుపేట మండలం చించల్‌పేట ఎంపీటీసీగా విజయాన్ని కైవసం చేసుకున్నారు. నవాబుపేట ఎంపీపీ బరిలో దుర్గాభవాని ఉందని విశ్వసనీయ సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment