ఎంపీటీసీల భాగస్వామ్యంతో బంగారు తెలంగాణకు బాటలు వేయాలని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ప్రభుత్వానికి సూచించారు.
హైదరాబాద్: ఎంపీటీసీల భాగస్వామ్యంతో బంగారు తెలంగాణకు బాటలు వేయాలని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ప్రభుత్వానికి సూచించారు. గ్రామజ్యోతి కార్యక్రమానికి తమను దూరం చేయటాన్ని నిరసిస్తూ శనివారం ఇందిరాపార్క్ వద్ద ఎంపీటీసీలు నిర్వహించారు. ఈ దీక్షా శిబిరంలో ఎమ్మెల్యే పాల్గొని వారికి మద్దతు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ గ్రామజ్యోతి కార్యక్రమానికి ఎంపీటీసీలను ఆహ్వానించకపోవటం తగదన్నారు దీక్షల్లో వివిధ జిల్లాల నుంచి దాదాపు 500 మంది ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.