గ్రామాల్లో ఉపవేఢీ | in villages subelections heat | Sakshi
Sakshi News home page

గ్రామాల్లో ఉపవేఢీ

Published Wed, Sep 28 2016 11:57 PM | Last Updated on Thu, Oct 4 2018 5:34 PM

in villages subelections heat

తణుకు టౌన్‌ :జిల్లాలో వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు పదవులకు ఎట్టకేలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం అక్టోబర్‌ 20వ తేదీలోగా ఓటరు జాబితాలను సవరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఈనెల 22వ తేదీన జిల్లా పంచాయతీ అధికారితోపాటు మండల స్థాయి అధికారులకు ఉత్తర్వులు అందాయి.
 స్థానిక సంస్థల్లో ఖాళీ అయిన స్థానాలకు ఆరు నెలల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలని చట్టం చెబుతున్నా.. మూడు సంవత్సరాల మూడు నెలల అనంతరం ఉప ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. తెలంగాణ నుంచి జిల్లాలో విలీనమైన కుక్కునూరు, వేలేరుపాడు జెడ్పీటీసీలతోపాటు కుక్కునూరు మండలంలో 8 ఎంపీటీసీ, వేలేరుపాడు మండలంలో 7 ఎంపీటీసీ పదవులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇవికాకుండా జిల్లాలో 18 సర్పంచ్, 22 ఎంపీటీసీ, 123 పంచాయతీ వార్డు పదవులకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఎన్నికల సంఘం ఉత్తర్వులతో వీటన్నిటికీ త్వరలో నగారా మోగనుంది.
ఖాళీలు ఇలా.. : మొగల్తూరు మండలం మోడి సర్పంచ్‌తోపాటు వార్డు పదవులకు, ఇదే మండలంలోని శేరేపాలెం సర్పంచ్, పెదవేగి మండలం పెదకడిమి, తాళ్లపూడి మండలం పెద్దేవం, దెందులూరు మండలం చల్ల చింతలపూడి, ఇరగవరం మండలం అర్జునుడుపాలెం, కొవ్వూరు మండలం కుమారదేవం, ఉంగుటూరు మండలం అప్పారావుపేట, ఉండి మండలం పాములపర్రు, టి.నర్సాపురం మండలం వెలగపాడు, కాళ్ల మండలం కోమటిగుంట, జక్కరం, పల్లిపాలెం, వీరవాసరం మండలం మత్స్యపురి, తోలేరు, పెర్కిపాలెం, పెదపాడు మండలం తాళ్లగూడెం, భీమవరం మండలం తుందుర్రు సర్పంచ్‌ పదవులకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీ పదవులకు సంబంధించి చాగల్లు మండలం నెలటూరు, కొయ్యలగూడెం మండలం పొంగుటూరు, మొగల్తూరు మండలం శేరేపాలెం, కొత్తపాలెం, పెరవలి మండలం తీపర్రు, కొవ్వూరు మండలం ఆరికిరేవుల, నిడమర్రు మండలం తోకలపల్లి, యలమంచిలి మండలం పెనుమర్రు, కుక్కునూరు మండలం అమరవరం, దామరచర్ల, మాధవరం, వింజరం, కివ్వాక, కుక్కునూరు 1, 2, దాచారం, వేలేరుపాడు మండలంలో మిడిపల్లె, తాట్కూరు, నర్లవరం, తాట్కూరు గొమ్ము, భూదేవి పేట, రేపాకగొమ్ము, రామవరం, ఎంపీటీసీల స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వీటితోపాటు జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఖాళీగా ఉన్న 123 వార్డు సభ్యుల పదవులకు కూడా ఉప ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. 
 
 
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement