ward members
-
ఉప ఎన్నికల్లోనూ సగానికిపైగా ఏకగ్రీవాలు
సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా 484 మండలాల పరిధిలో మొత్తం 1,033 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో సగానికి పైగా స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఆయా గ్రామాల్లో మొత్తం 66 సర్పంచ్ స్థానాలతోపాటు 1,064 వార్డు సభ్యులకు ఉప ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. పదో తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగగా, సోమవారం సాయంత్రం మూడు గంటలకు నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ముగిసింది. అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి అందిన సమాచారం మేరకు.. సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగే మొత్తం 66 గ్రామాల్లో 32 చోట్ల ఎన్నిక ఏకగ్రీవం కాగా, రెండుచోట్ల అభ్యర్థులెవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. కేవలం 32చోట్ల మాత్రమే సర్పంచ్ స్థానాలకు ఈ నెల 19న పోలింగ్ జరగనుంది. మరోవైపు 1,064 వార్డు సభ్యులకు ఉప ఎన్నికలు జరుగుతుండగా.. 757 స్థానాలు ఏకగ్రీవం కాగా, 261 చోట్ల 19న పోలింగ్ జరగనుంది. 46 వార్డు సభ్యుల స్థానాలకు ఒక్కరు కూడా నామినేషన్లు దాఖలు చేయనందున ఆయా స్థానాల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. మూడురెట్లు పెరిగిన ఏకగ్రీవాలు.. రెండున్నర ఏళ్ల క్రితం... అంటే 2021 జనవరి, ఫిబ్రవరిలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో సర్పంచ్ స్థానాల్లో కేవలం 17 శాతం, వార్డు సభ్యుల స్థానాల్లో 36 శాతం ఏకగ్రీవమయ్యాయి. కానీ, ఇప్పుడు రెండున్నర ఏళ్ల తర్వాత ఉప ఎన్నికలు జరుగుతున్నప్పటికీ.. అప్పటికంటే సర్పంచ్ స్థానాల్లో దాదాపు మూడు రెట్లు ఏకగ్రీవాలు పెరగగా, వార్డు సభ్యుల స్థానాల్లో ఏకగ్రీవాలు రెట్టింపు కావడం గమనార్హం. -
వార్డు అభ్యర్థుల కిడ్నాప్.. టీడీపీ నేతలపై ఫిర్యాదు
కుప్పం: కుప్పం మునిసిపాలిటీ 14వ వార్డుకు నామినేషన్లు వేసిన ఇద్దరిని టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారని వారి బంధువులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ కాలనీకి చెందిన ప్రకాష్, అతడి భార్య తిరుమగన్ 14వ వార్డుకు నామినేషన్లు దాఖలు చేశారు. అప్పటి నుంచి దంపతులతోపాటు వారి ఇద్దరు పిల్లలు కూడా కనిపించడంలేదు. దీనిపై ప్రకాష్ అన్న గోవిందరాజులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డి, చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్, పీఎస్ మునిరత్నం, మాజీ సర్పంచ్ వెంకటేష్ తన తమ్ముడి కుటుంబాన్ని కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. మాజీ మంత్రి, చంద్రబాబు కార్యదర్శులపై ఫిర్యాదు -
ఉప సర్పంచ్‌లు, వార్డు మెంబర్లకు ఈసీ షాక్!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : పంచాయతీ ఎన్నికల్లో గెలు పొంది ఖర్చులు చూపించని ప్రజాప్రతినిధులపై ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందించకపోవడంతో చివరకు వారిపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా 42మంది ఉప సర్పంచ్‌లు, 534మంది వార్డు సభ్యులు మొత్తంగా 576మంది పదవులు కోల్పోయారు. లెక్కలు చూపడంలో తాత్సారం జిల్లా వ్యాప్తంగా 844 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 837 పంచాయతీలకు 2019 జనవరి మాసంలో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించారు. కాగా, పోటీచేసిన అభ్యర్థులంతా మూడు నెలల్లో ఎన్నికల్లో ఖర్చు చేసిన వ్యయాన్ని ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటుంది. దీనిపై ఎన్నికల సంఘం ఖర్చు వివరాల నివేదికను కోరినా చాలామంది స్పందించలేదు. ఖర్చుల వివరాలు సమర్పించని వారికి ఎన్నికల సంఘం ప్రత్యేకంగా నోటీసులు కూడా జారీ చేసింది. అయినా, వారు పెడచెవిన పెట్టడంతో ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుని నోటీసులకు స్పందించని వారందరూ పదవులు కోల్పోతున్నట్లు ప్రకటించింది. కోర్టును ఆశ్రయించే యోచనలో.. ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందిన కొందరు ఎన్నికల సంఘానికి ఖర్చుల వివరాలు సమర్పించారు. అయితే, వారు నోటీసులకు సకాలంలో స్పందించకపోవడంతోనే అనర్హత వేటు వేసినట్లు ఎన్నికల సంఘం అధికారులు పేర్కొంటున్నారు. మరికొందరు అభ్యర్థులు ఎన్నికల వ్యయం లెక్కలు ఎలా సమర్పించాలో తెలియదని చెబుతుండగా, ఇంకొందరు తమకు నోటీసులు అందలేదని పేర్కొంటున్నారు. ఈ విషయంపై అనర్హత వేటుకు గురైన అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసులకు స్పందించని కారణంగానే వారిపై అనర్హత వేటు వేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఖాళీ స్థానాలకు ఎన్నికలు జిల్లా వ్యాప్తంగా అనర్హత వేటుకు గురైన 576 వార్డు సభ్యుల స్థానాలతో పాటు ఏడుగురు సభ్యులు మృతిచెందిన స్థానాలు మొత్తంగా 583 వార్డులకు ఎన్నికల సంఘం తిరిగి ఎన్నికలు నిర్వహించనుంది. కాగా, ఉప సర్పంచ్‌లు అనర్హత వేటుకు గురైన పంచాయతీల్లో కోరం ఉంటే మరో సభ్యుడిని ఎన్నుకుని ఆ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. కోరం లేని పంచాయతీల్లో సర్పంచ్‌తో పాటు సంబంధిత అధికారికి జాయింట్ చెక్ పవర్ ఇవ్వనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి పేర్కొన్నారు. చదవండి: 11 సార్లు ఓటమి.. గెలిపించే వరకు పోటీ చేస్తా -
ఏపీలో ఆగిన పంచాయతీలకు పోలింగ్
సాక్షి, అమరావతి: నోటిఫికేషన్ జారీచేసిన తర్వాత ఎవరూ నామినేషన్ దాఖలు చేయక, ఇతరత్రా కారణాలతో నిలిచిపోయిన సర్పంచి, వార్డు సభ్యుల పదవులకు సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. 13 పంచాయతీల సర్పంచి పదవులతో పాటు 372 పంచాయతీల పరిధిలో 723 వార్డు పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 2వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 13 సర్పంచి పదవులకుగాను 3 చోట్ల ఎన్నిక ఏకగ్రీవం అయింది. 4 చోట్ల రెండోసారి కూడా సర్పంచి పదవికి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. మిగిలిన 6 చోట్ల సోమవారం ఉదయం 6.30 గంటల నుంచి పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ అనంతరం ఓట్లు లెక్కిస్తారు. 6 సర్పంచి పదవులకు 14 మంది పోటీలో ఉన్నారు. 723 వార్డు సభ్యుల పదవులకుగాను 561 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 107 చోట్ల ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. మిగిలిన 55 వార్డులకు సోమవారం పోలింగ్ జరగుతోంది. ఈ వార్డుల్లో 112 మంది పోటీలో ఉన్నారు. చదవండి: ఓ అభ్యర్థికి ఒక్క ఓటూ పడలేదు. -
క్షేత్రస్థాయి నేతలకు పార్టీల గాలం
సాక్షి, హైదరాబాద్: పోలింగ్ గడువు దగ్గరపడుతున్నకొద్దీ అన్ని ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో ఓట్లు రాల్చగల నేతలకు గాలం వేసే పనిలో పడ్డాయి. ముఖ్యంగా గ్రామాల్లో పట్టున్న సర్పంచ్‌లు, వార్డు సభ్యులతోపాటు గత ఎన్నికల్లో సర్పంచ్‌లుగా పోటీ చేసి ఓడిన నేతలను సైతం మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. కనీసం వంద నుంచి వెయ్యి ఓట్లను ప్రభా వితం చేయగల నేతలను గుర్తించి వారిని మచ్చిక చేసుకునే బాధ్యతను పార్టీలు నియోజకవర్గ నేతలకు అప్పగిస్తున్నాయి. వారితోపాటే కుల సంఘాల పెద్దలు, కార్మిక సంఘాల నేతలు, మహిళా సంఘాల నేతలతో పార్టీల అభ్యర్థులే నేరుగా మాట్లాడుతూ వారు కోరిన మేర హామీలు ఇస్తూ ఓట్లు రాబట్టుకునే పనిలో పడ్డారు. ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలన్న పట్టుదలతో ఉన్న నేతలు గ్రామాలవారీగా పట్టున్న నేతలు, సంఘ పెద్దలపై దృష్టి సారించారు. అందరూ కావాల్సిన వారే.. ఇటీవలి సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో ముగ్గురు నుంచి ఐదుగురు అభ్యర్థులు పోటీ పడ్డారు. ఇందులో మెజారిటీ సర్పంచ్‌లు అధికార పార్టీ మద్దతుతో గెలిచినా ఓడిన అభ్యర్థుల్లోనూ చాలా మంది టీఆర్ఎస్ బలపరిచిన వారు ఉన్నారు. వారిలోనూ చాలా మందికి వందల సంఖ్యలో ఓట్లు వచ్చాయి. ఓడిన అభ్యర్థులను మచ్చిక చేసుకునేందుకు ఇప్పటికే కాంగ్రెస్ సహా ఇతర పార్టీల అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికార పార్టీ... ఓడిన అభర్థులపైనా దృష్టి పెట్టి పార్టీలో చేర్చుకుంటోంది. దీంతోపాటే చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సర్పంచ్‌లకు వివిధ హామీలు ఇస్తూ పార్టీలో చేర్చుకుంటోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభలకు ముందుగా నిర్వహిస్తున్న సభల్లోనే ఇతర పార్టీల సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు పార్టీ కండువాలు వేస్తోంది. ఇక కాంగ్రెస్ సైతం తమ పార్టీ సర్పంచ్‌లను కాపాడుకుంటూనే టీఆర్ఎస్ అసమ్మతి నేతలను ఆకట్టుకునే పనిలో పడింది. వారితో ఆయా ప్రాంతాల్లోని క్షేత్రస్థాయి నేతలతో మాట్లాడిస్తోంది. వారికున్న ఇబ్బందులను తెలుసుకుంటూ వాటిని తీరుస్తామంటూ అభ్యర్థులు హామీ ఇస్తున్నారు. మహిళా సంఘాలకు గ్రామస్థాయిలో మహిళా భవనాలు, వాటిలో సౌకర్యాలతోపాటు తమకు అనుకూలంగా ఓటేసేందుకు ఏం కావాలో అడుగుతున్నారు. ఈ విషయంలో గ్రామ, మండలస్థాయి సంఘాల నాయకులతో మంతనాలు చేస్తున్నా రు. మహిళా సంఘాలను మచ్చిక చేసుకొని తమవైపు ఓట్లు వేసుకునేలా ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. వాటితోపాటే కూలి పనుల కోసం హైదరాబాద్‌లో ఉంటున్న వారికి గ్రామస్థాయి నాయకులు ద్వారా ఫోన్లు చేయిస్తున్నారు. ఓటుకు రూ. 2 వేలు ఇవ్వడంతోపాటు పోలింగ్ రోజున ప్రయాణ ఖర్చులు భరిస్తామని హామీ ఇస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఓటర్లకు సమాచారం చేరవేస్తున్నారు. చేవెళ్ల, నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ నియోజకవర్గాల లోక్‌సభ అభ్యర్థులు ఇలాంటి ప్రచారంలో ముందున్నారని తెలుస్తోంది. -
రాజకీయ నిరుద్యోగులకు ఊరట..!
సాక్షి, కుల్కచర్ల: తెలంగాణ ప్రభుత్వం కొత్తగా రూపొందించిన 2018 పంచాయతీరాజ్ చట్టంతో గ్రామీణ ప్రాంతాల్లోని రాజకీయ నిరుద్యోగులకు కొంత ఊరట లభించనుంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా గ్రామ పంచాయతీ పాలకవర్గంలోనూ కో–ఆప్షన్ సభ్యులను నియమించుకునేందుకు తెలగాణ ప్రభుత్వం కొత్త చట్టంలో వెలుసుబాటు కల్పించింది. గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకవర్గం కొలువుదీరి రెండు నెలలు పూర్తిఅయ్యింది. పాలన పై శిక్షణ తరగతులు కూడా అధికారులు పూర్తిచేశారు. కొత్త పంచాయతీ చట్టంలో రూపొందించిన విధంగా కో–ఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ మిగిలింది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్... ఎంపిక విధానంపై మార్గదర్శకాలు విడుదలచేస్తే ఆయా పంచాయతీల పాలకవర్గం అభిప్రాయం మేరకు సర్పంచ్ సన్నిహితులకు, విధేయులకు ఛాన్స్ లభించనుంది. సర్పంచ్, ఉపసర్పంచ్ వార్డు సభ్యులతో పాటు గ్రామానికి చెందిన మరో ముగ్గురిని కో–ఆప్షన్ సభ్యులుగా ఎంపిక చేసుకుంటే వారి విలువైన సలహాలు గ్రామపంచాయతీ అభివృద్ధికి కొంతమేరకు తోడ్పాటు లభించినట్టవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వారికి వార్డు సభ్యులతో సమానహోదా ఉంటుంది. గ్రామ పంచాయతీ సమావేశాలలో తీర్మానం సమయంలో చేసే చర్చలో వారు కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. ఇప్పటివరకు మండల కో–ఆప్షన్‌గానే ఎంపిక చేసేవారు ఇప్పడు జీపీలలోకూడాముగ్గురిని ఎంపిక చేయనున్నారు. ప్రాధాన్యత వీరికే... ప్రతి గ్రామ పంచాయతీలో ముగ్గురు చొప్పున కో–ఆప్షన్ సభ్యులను పంచాయతీ పాలకవర్గం నిర్ణయం మేరకు అధికారులు నియమిస్తారు. ఇందులో సీనియర్ సిటిజన్, రిటైర్డ్ ఉద్యోగికి ఒకటి, మహిళా సంఘాల సభ్యులలో చురుగ్గా పనిచేసేవారికి ఒకటి, స్వచ్ఛంద సంస్థల వారు గ్రామ అభివృద్ధి కోసం ఇదివరకే కృషిచేసే వారికి ఒకటి ఈ విధంగా ముగ్గురిని నియమిస్తారు. ఈ ముగ్గురు గ్రామాలలో నివసిస్తూ ఉన్నావారు అయిఉండాలి. ఈ ముగ్గురిలో తప్పనిసరిగా ఒకరు మహిళ ఉంటారు. వీరు గ్రామాభివృద్ధి కోసం చేపట్టాల్సిన ప్రతి కార్యక్రమాలపై పంచాయతీ సమావేశాల్లో చర్చిస్తారు. మండలలో 132 మంది కో–ఆప్షన్లు... కుల్కచర్ల మండలంలో ప్రస్తుతం 44 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఈ లెక్కన గ్రామపంచాయతీకి ముగ్గురు చొప్పున 132 మందిని కో–ఆప్షన్ సభ్యులుగా ఎన్నుకోనున్నారు. వార్డుసభ్యులతో సమాన హోదా కో–ఆప్షన్ సభ్యులకు రానుంది. ఈ విషయమై మండల అధికారులను వివరణ కోరగా 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. ప్రభుత్వం మార్గాదర్శకాలను విడుదల చేసిన వెంటనే నియామకాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. -
2న గ్రామ పంచాయతీల తొలి సమావేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడు విడతలుగా నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికలు బుధవారంతో ముగిశాయి. ఈ నెల 21, 25, 30 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో (హైదరాబాద్ జిల్లా మినహా) జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొం దిన సర్పంచ్‌లు, వార్డు మెంబర్లకు ఫిబ్రవరి 2ను అపాయింట్మెంట్ డేగా నిర్ణయిస్తూ పంచాయతీ రాజ్ శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. శనివారం (ఫిబ్రవరి 2న) కొత్త గ్రామపంచాయతీలు కొలువుదీరనున్నాయి. ఈ సందర్భంగా కొత్త గ్రామపంచాయతీల తొలి సమావేశం జరగనుంది. అదే రోజున సర్పంచ్‌లు, వార్డు సభ్యులు పదవీ ప్రమాణం చేసి బాధ్యతలు చేపడతారు. ఆ రోజు నుంచి వారి పదవీ కాలం ఐదేళ్ల పాటు కొనసాగనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) నోటిఫికేషన్లకు అనుగుణంగా మూడు దశలుగా ఈ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. వివిధ కారణాలతో అంతకు ముందు, ఈ నెల 30న ఎన్నికలు జరగని పంచాయతీలు, ఇంకా గడువు ముగియని పంచాయతీలకు పంచాయతీరాజ్‌శాఖ విడిగా అపాయింటెడ్ డేను ప్రకటించనుంది. ఈ మేరకు పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ నీతూకుమారి ప్రసాద్ నోటిఫికేషన్ జారీ చేశారు. స్థానిక సంస్థల ప్రతినిధులకు ముఖ్యంగా గ్రామస్థాయిల్లోని పంచాయతీ సర్పంచ్‌లకు కొత్త పంచాయతీరాజ్ చట్టంతో సహా గ్రామస్థాయిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం తదితర కార్యక్రమాల గురించి సమగ్ర అవగాహన కల్పించి, క్షేత్రస్థాయిలో అభివృద్ధిలో భాగస్వాములను చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో ఈ శిక్షణ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఏర్పడింది. 11 నుంచి సర్పంచ్‌లకు శిక్షణ.. రాష్ట్రవ్యాప్తంగా గెలుపొందిన సర్పంచ్‌లకు ఫిబ్రవరి 11 నుంచి మార్చి 1 వరకు ఆయా జిల్లాల వారీగా విభజించి మూడు విడతలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఒక్కో విడతలో రెండు బ్యాచ్‌లుగా వంద మందికి శిక్షణ ఇస్తారు. తొలి విడత శిక్షణను ఫిబ్రవరి 11 నుంచి 15 వరకు, రెండో విడత శిక్షణను ఫిబ్రవరి 18 నుంచి 22 వరకు, మూడో విడత శిక్షణను ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1 వరకు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. సంబంధిత జిల్లా కేంద్రాల్లో ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ముందుగా శిక్షకులకు శిక్షణ (ట్రైనింగ్ టు ట్రైనర్స్) కోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాట్లు చేసింది. కొత్త పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన.. తాజాగా ఎన్నికైన సర్పంచ్‌లకు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టం పట్ల అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శిక్షణ అనంతరం వారి పనితీరుకు అనుగుణంగా సర్పంచ్‌లకు గ్రేడింగ్‌లు ఇస్తారు. -
‘పంచాయతీ’ అభ్యర్థీ.. ఇవి తెలుసుకో!
సాక్షి, హైదరాబాద్: తొలివిడత పల్లె పోరు జోరందుకుంది. సోమవారం నుంచి నామినేషన్ల దాఖలు పర్వం మొదలుకావడంతో పోటీదారుల్లో ఉత్సాహం పెరిగింది. బుధవారంతో మొదటి విడత నామినేషన్ల ఘట్టం ముగియనుండగా... సర్పంచ్, వార్డు సభ్యత్వానికి పోటీ చేసేవారిలో ఇంకా సందేహాలు తొలగడం లేదు. గ్రామపంచాయతీలో ఓటున్న వార్డులోనే వార్డు సభ్యుడి పోటీకి అర్హుడా?.. లేక పంచాయతీ పరిధిలో ఏ వార్డు నుంచైనా పోటీ చేయొచ్చా?.. ప్రతిపాదించే ఓటరు (ప్రపోజర్) నిబంధనలేంటి?.. సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థికి సంబంధించిన నిబంధనలు, ప్రపోజర్ నియమాలు తదితరాలపై ఎన్నికల సంఘం కొన్ని సూచనలు చేసింది. వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్న వార్డులోనే అభ్యర్థిని ప్రతిపాదించే వ్యక్తి ఓటరై ఉండాలి. అలాగే సర్పంచ్ అభ్యర్థి ప్రపోజర్ కూడా అదే పంచాయతీలోనే ఓటరుగా నమోదై ఉండాలి. అభ్యర్థులు కోరుకుంటే ఒకటి నుంచి నాలుగు వరకు నామినేషన్ సెట్లు దాఖలు చేయొచ్చు. నామినేషన్ పత్రం దాఖలు చేసినట్లుగా ధ్రువీకరణ కోసం తగిన రసీదు పొందాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. - పోటీకి సిద్ధపడడానికి ముందే అభ్యర్థి పేరు, చిరునామా, ఇతర వివరాలు తాజా ఓటరు లిస్ట్‌లో ఉన్నాయో లేదో చూసుకోవాలి. - నిర్దేశిత (నమూనా–మూడు) పత్రం ప్రకారం నామినేషన్ ఉందా? లేదా? అభ్యర్థి, ప్రపోజర్ల సంతకాలున్నాయా లేదా చూసుకోవాలి. - అభ్యర్థి సంతకం చేసిన స్వయం ధ్రువీకరణపత్రం మరో ఇద్దరి సంతకాలతో ధ్రువీకరణ అయిందో లేదో సరిచూసుకోవాలి. - నామినేషన్ పత్రాన్ని అభ్యర్థి స్వ యంగాలేదా ప్రపోజర్ ద్వారానే సమర్పించాలి. - ప్రతీ పోలింగ్ కేంద్రానికి నిర్ణీత పద్ధతి ప్రకారం పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవాలి. - నామినేషన్లు వేసిన నాటి నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకయ్యే వ్యయాన్ని ఈసీ నిర్దేశించిన నమూనాలో నిర్వహించాలి. - మతం,జాతి, కులం, వర్గం లేదా భాష ఆధారంగా ఓటు వేయాలని, వేయొద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేయొద్దు. (అలా చేస్తే శిక్షార్హులవుతారు) - అభ్యర్థుల వ్యక్తిగత నడవడిక, ప్రవర్తన గురించి, ఒక అభ్యర్థి అభ్యర్థిత్వం లేదా ఉపసంహరణ గురించి తప్పుడు సమాచారం ప్రచురించకూడదు. - పోలింగ్ తేదీల్లో పోలింగ్ స్టేషన్లకు వంద మీటర్ల పరిధిలో ప్రచారం నిర్వహించరాదు. - సంఘం, కులం లేదా వర్గం నుంచి బహిష్కరిస్తామని అభ్యర్థులను లేదా ఓటర్లను బెదిరించరాదు - అనుకూలంగా ఓటు వేయమని కోరడంలో భాగంగా పేరు, ఎన్నికల గుర్తుతో కూడిన గుర్తింపు చీటీలు పంపిణీ చేయొద్దు. -
తండాలన్నీ ఎస్టీలకు కాదు!
సాక్షి, హైదరాబాద్ : .. ఈ పరిస్థితి రెండు గ్రామ పంచాయతీలకే పరిమితం కావడం లేదు. కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటవుతున్న వందలాది తండాల్లో ఈ సమస్య తలెత్తనుంది. ఇతర వర్గాల ఓటర్లు కనీసం పది మంది కూడా లేనిచోట రిజర్వేషన్ల రొటేషన్లతో ఆయా వర్గాలకు సర్పంచ్ పదవి కేటాయించే పరిస్థితి ఉంటుంది. దీనితో తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి ఎస్టీలకు పాలనా అవకాశం కల్పించాలన్న లక్ష్యం నీరుగారిపోనుంది. ఈ పరిస్థితిని ఊహించిన పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఏం చేయాలనేదానిపై తర్జనభర్జన పడుతున్నారు. ఈ ఇబ్బందిని అధిగమించేలా కొత్త పంచాయతీరాజ్ చట్టంలో ప్రత్యేకంగా నిబంధనలు చేర్చే విషయంపై న్యాయశాఖతో కలసి అధ్యయనం చేస్తున్నారు. 4,122 కొత్త పంచాయతీలు రాష్ట్రంలో జనాభా ఎక్కువగా ఉన్న శివారు గ్రామాలు, పల్లెలు, తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. మైదాన ప్రాంతాల్లో 500 మంది జనాభా ప్రాతిపదికన.. కొండలు, గుట్టల ప్రాంతాల్లో, ప్రత్యేక భౌగోళిక ప్రాంతాల్లో 300 జనాభా ప్రాతిపదికన ఆవాసాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చేలా మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని 30 జిల్లాల నుంచి 4,122 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. అందులో 1,879 సాధారణ ఆవాసాలు, 2,243 తండాలు ఉన్నాయి. చివరిగా మరోసారి జిల్లాల నుంచి నివేదికలు తెప్పిస్తున్నారు. కొత్త పంచాయతీలతో కలిపి రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు మొత్తంగా 12,806కు చేరనున్నాయి. 957 కొత్త పంచాయతీల్లో సమస్యలు స్థానిక సంస్థల ఎన్నికల మార్గదర్శకాల ప్రకారం.. ప్రతి ఐదేళ్లకు సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ మారుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అన్ని పదవులను పూర్తిగా ఎస్టీ వర్గం వారికే కేటాయిస్తారు. కానీ మైదాన ప్రాంతాల్లోని తండాల్లో రిజర్వేషన్ల రొటేషన్ సమస్య తలెత్తనుంది. రాష్ట్రంలో కొత్తగా 2,243 తండాలు గ్రామ పంచాయతీగా ఏర్పాటు కానుండగా.. ఇందులో 100 శాతం ఎస్టీ జనాభా ఉన్నవి 1,286 మాత్రమే. మిగతా 957 తండాల్లో ఇతర వర్గాలకు చెందినవారు కొద్ది సంఖ్యలో నివసిస్తున్నారు. దీంతో సర్పంచ్‌తోపాటు కొన్ని వార్డు సభ్యుల పదవులు ఇతర వర్గాలకు రిజర్వు అయ్యే పరిస్థితి ఉండనుంది. ప్రత్యేక నిబంధనపై కసరత్తు! గ్రామ పంచాయతీలుగా మారే తండాల్లోని ఓటర్లలో ఏ వర్గం వారు ఎంత మంది ఉన్నారన్న విషయంపై పంచాయతీరాజ్ అధికారులు అధ్యయనం చేస్తున్నారు. వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న తండాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులు పూర్తిగా ఎస్టీ వర్గం వారికే రిజర్వు అయ్యేలా కొత్త పంచాయతీరాజ్ చట్టంలో నిబంధనను చేర్చాలన్న అంశాన్ని న్యాయ శాఖ దృష్టికి తీసుకువచ్చారు. ఇక కేవలం నలుగురైదుగురు ఇతర వర్గాల వారున్న పంచాయతీల్లో రిజర్వేషన్ల రొటేషన్ అంశంపైనా చర్చిస్తున్నారు. త్వరలోనే ఈ అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశముంది. డీసీ తండా.. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఒక గ్రామ పంచాయతీ. నాలుగు తండాలు కలిపి గ్రామ పంచాయతీగా ఉంది. సమీపంలోని ఓ గ్రామం నుంచి నలుగురు బీసీ వర్గం వారు డీసీ తండాలో స్థిరపడ్డారు. 2013 పంచాయతీ ఎన్నికల సమయంలో డీసీ తండా సర్పంచ్ పదవి రొటేషన్‌లో బీసీలకు వచ్చింది. నలుగురే ఓటర్లున్న వర్గానికి రిజర్వేషన్ రావడంతో గిరిజనులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. దాంతో ఎవరూ నామినేషన్ వేయక, సర్పంచ్ ఎన్నిక జరగలేదు. వార్డు సభ్యులలో ఒకరు ఉప సర్పంచ్ అయ్యారు. ఆయనే ఇన్చార్జి సర్పంచ్‌గా వ్యవహరిస్తున్నారు. రాంధన్ తండా.. వర్ధన్నపేట మండలంలోని మరో గ్రామ పంచాయతీ. ఒక్క కుటుంబం మినహా అంతా లంబాడీ తెగవారే. కానీ 2013 ఎన్నికలప్పుడు రిజర్వేషన్ రొటేషన్‌లో సర్పంచ్ పదవి బీసీలకు కేటాయించారు. ఉన్న ఒక్క కుటుంబంలోని వారే సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. -
కన్నారం వార్డు సభ్యుల రాజీనామా
హుస్నాబాద్: కన్నారం గ్రామాన్ని వరంగల్ జిల్లా వేలేరు మండలంలో కలుపడాన్ని వ్యతిరేకిస్తూ తమ పదవులకు రాజీనామా చేసినట్లు గ్రామ వార్డు సభ్యులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కన్నారంను అక్కన్నపేట మండలంలో కలుపడమే ప్రయోజనమన్నారు. తమ రాజీనామా పత్రాలను గ్రామ సర్పంచ్ సదానందంకు ఇచ్చినట్లు వార్డు సభ్యులు సిహెచ్ బుచ్చమ్మ, ఎన్ పద్మ, ఏ. రాజమ్మ, ఎం. కనుకమ్మ, డీ. కుమార్, ఎం. రాములు, ఎం. రమేష్, ఎస్. అర్చన తెలిపారు. -
గ్రామాల్లో ఉపవేఢీ
తణుకు టౌన్ :జిల్లాలో వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు పదవులకు ఎట్టకేలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం అక్టోబర్ 20వ తేదీలోగా ఓటరు జాబితాలను సవరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఈనెల 22వ తేదీన జిల్లా పంచాయతీ అధికారితోపాటు మండల స్థాయి అధికారులకు ఉత్తర్వులు అందాయి. స్థానిక సంస్థల్లో ఖాళీ అయిన స్థానాలకు ఆరు నెలల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలని చట్టం చెబుతున్నా.. మూడు సంవత్సరాల మూడు నెలల అనంతరం ఉప ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. తెలంగాణ నుంచి జిల్లాలో విలీనమైన కుక్కునూరు, వేలేరుపాడు జెడ్పీటీసీలతోపాటు కుక్కునూరు మండలంలో 8 ఎంపీటీసీ, వేలేరుపాడు మండలంలో 7 ఎంపీటీసీ పదవులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇవికాకుండా జిల్లాలో 18 సర్పంచ్, 22 ఎంపీటీసీ, 123 పంచాయతీ వార్డు పదవులకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఎన్నికల సంఘం ఉత్తర్వులతో వీటన్నిటికీ త్వరలో నగారా మోగనుంది. ఖాళీలు ఇలా.. : మొగల్తూరు మండలం మోడి సర్పంచ్‌తోపాటు వార్డు పదవులకు, ఇదే మండలంలోని శేరేపాలెం సర్పంచ్, పెదవేగి మండలం పెదకడిమి, తాళ్లపూడి మండలం పెద్దేవం, దెందులూరు మండలం చల్ల చింతలపూడి, ఇరగవరం మండలం అర్జునుడుపాలెం, కొవ్వూరు మండలం కుమారదేవం, ఉంగుటూరు మండలం అప్పారావుపేట, ఉండి మండలం పాములపర్రు, టి.నర్సాపురం మండలం వెలగపాడు, కాళ్ల మండలం కోమటిగుంట, జక్కరం, పల్లిపాలెం, వీరవాసరం మండలం మత్స్యపురి, తోలేరు, పెర్కిపాలెం, పెదపాడు మండలం తాళ్లగూడెం, భీమవరం మండలం తుందుర్రు సర్పంచ్ పదవులకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీ పదవులకు సంబంధించి చాగల్లు మండలం నెలటూరు, కొయ్యలగూడెం మండలం పొంగుటూరు, మొగల్తూరు మండలం శేరేపాలెం, కొత్తపాలెం, పెరవలి మండలం తీపర్రు, కొవ్వూరు మండలం ఆరికిరేవుల, నిడమర్రు మండలం తోకలపల్లి, యలమంచిలి మండలం పెనుమర్రు, కుక్కునూరు మండలం అమరవరం, దామరచర్ల, మాధవరం, వింజరం, కివ్వాక, కుక్కునూరు 1, 2, దాచారం, వేలేరుపాడు మండలంలో మిడిపల్లె, తాట్కూరు, నర్లవరం, తాట్కూరు గొమ్ము, భూదేవి పేట, రేపాకగొమ్ము, రామవరం, ఎంపీటీసీల స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వీటితోపాటు జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఖాళీగా ఉన్న 123 వార్డు సభ్యుల పదవులకు కూడా ఉప ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. -
గ్రామాల్లో ఉపవేఢీ
తణుకు టౌన్ :జిల్లాలో వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు పదవులకు ఎట్టకేలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం అక్టోబర్ 20వ తేదీలోగా ఓటరు జాబితాలను సవరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఈనెల 22వ తేదీన జిల్లా పంచాయతీ అధికారితోపాటు మండల స్థాయి అధికారులకు ఉత్తర్వులు అందాయి. స్థానిక సంస్థల్లో ఖాళీ అయిన స్థానాలకు ఆరు నెలల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలని చట్టం చెబుతున్నా.. మూడు సంవత్సరాల మూడు నెలల అనంతరం ఉప ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. తెలంగాణ నుంచి జిల్లాలో విలీనమైన కుక్కునూరు, వేలేరుపాడు జెడ్పీటీసీలతోపాటు కుక్కునూరు మండలంలో 8 ఎంపీటీసీ, వేలేరుపాడు మండలంలో 7 ఎంపీటీసీ పదవులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇవికాకుండా జిల్లాలో 18 సర్పంచ్, 22 ఎంపీటీసీ, 123 పంచాయతీ వార్డు పదవులకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఎన్నికల సంఘం ఉత్తర్వులతో వీటన్నిటికీ త్వరలో నగారా మోగనుంది. ఖాళీలు ఇలా.. : మొగల్తూరు మండలం మోడి సర్పంచ్‌తోపాటు వార్డు పదవులకు, ఇదే మండలంలోని శేరేపాలెం సర్పంచ్, పెదవేగి మండలం పెదకడిమి, తాళ్లపూడి మండలం పెద్దేవం, దెందులూరు మండలం చల్ల చింతలపూడి, ఇరగవరం మండలం అర్జునుడుపాలెం, కొవ్వూరు మండలం కుమారదేవం, ఉంగుటూరు మండలం అప్పారావుపేట, ఉండి మండలం పాములపర్రు, టి.నర్సాపురం మండలం వెలగపాడు, కాళ్ల మండలం కోమటిగుంట, జక్కరం, పల్లిపాలెం, వీరవాసరం మండలం మత్స్యపురి, తోలేరు, పెర్కిపాలెం, పెదపాడు మండలం తాళ్లగూడెం, భీమవరం మండలం తుందుర్రు సర్పంచ్ పదవులకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీ పదవులకు సంబంధించి చాగల్లు మండలం నెలటూరు, కొయ్యలగూడెం మండలం పొంగుటూరు, మొగల్తూరు మండలం శేరేపాలెం, కొత్తపాలెం, పెరవలి మండలం తీపర్రు, కొవ్వూరు మండలం ఆరికిరేవుల, నిడమర్రు మండలం తోకలపల్లి, యలమంచిలి మండలం పెనుమర్రు, కుక్కునూరు మండలం అమరవరం, దామరచర్ల, మాధవరం, వింజరం, కివ్వాక, కుక్కునూరు 1, 2, దాచారం, వేలేరుపాడు మండలంలో మిడిపల్లె, తాట్కూరు, నర్లవరం, తాట్కూరు గొమ్ము, భూదేవి పేట, రేపాకగొమ్ము, రామవరం, ఎంపీటీసీల స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వీటితోపాటు జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఖాళీగా ఉన్న 123 వార్డు సభ్యుల పదవులకు కూడా ఉప ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. -
‘స్థానిక’ ఉప ఎన్నికలకు నగారా
నోటిఫికేషన్ విడుదల చేసినరాష్ట్ర ఎన్నికల సంఘం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న మండల ప్రాదేశిక నియోజకర్గాలకు, సర్పంచ్, వార్డుసభ్యుల స్థానాల ఎన్నికలకు నగారా మోగింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్‌తోపాటు షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. ఈ నెల 26న ఎన్నికల నోటీసు, ఓటర్ల జాబితాలను ప్రకటించనుంది. నామినేషన్ల స్వీక రణ గడువు 29న సాయంత్రం ఐదు గంటల వర కు ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు సెప్టెంబర్ 3వ తేదీ వరకు విధించారు. 8న ఉద యం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం రెండు గం టల నుంచి సర్పంచ్, వార్డు స్థానాలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. 10 తేదీన ఉదయం 8 గంటల నుంచి ఎంపీటీసీ స్థానాల ఓట్లను లెక్కిస్తారు. ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలకు సంబంధించి సదరు మండల ప్రజాపరిషత్ ప్రాంతం, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి సదరు పంచాయతీ ప్రాంతం వరకు ఎన్నికల నియమావళి శనివారం నుంచే అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేసింది. అన్ని పార్టీలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు దీనికి లోబడి పనిచేయాలని ఆదేశించింది. ఈ ఉప ఎన్నికలకు అవసరమైన సన్నాహాలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ప్రారంభించింది. -
‘పుర’చైర్మన్ ఎన్నికలు నేడు
సాక్షి, ఒంగోలు: చాలా కాలం తర్వాత మున్సిపల్, నగర పంచాయతీలకు పూర్తి పాలకవర్గాలు ఏర్పాటవుతున్నాయి. వార్డు సభ్యుల ఎన్నిక ప్రక్రియ ఇప్పటికే పూర్తవగా, ఆయా మున్సిపాలిటీల చైర్మన్లను గురువారం వార్డుసభ్యులు ఎన్నుకోనున్నారు. చైర్మన్ల ఎన్నిక అనంతరం ఆయన ప్రతిపాదించిన నేత వైస్‌చైర్మన్‌గా నియామకం కానున్నారు. జిల్లాలో మొత్తం 6 చోట్ల మున్సిపల్ ఎన్నికలు మార్చినెలలో జరిగాయి. ఇందులో చీరాల, మార్కాపురం మున్సిపాలిటీలు కాగా, అద్దంకి, గిద్దలూరు, చీమకుర్తి, కనిగిరి నగర పంచాయతీలు. అన్నిచోట్ల కలిపి మొత్తం 145 వార్డులకు ఎన్నికలు జరగ్గా.. టీడీపీ 69 చోట్ల, వైఎస్సార్ కాంగ్రెస్ 57 స్థానాల్లో గెలుపొందింది. బీఎస్పీ 9, సీపీఐ, సీపీఎం చెరో ఒకటి వార్డుపదవిని కైవసం చేసుకోగా... స్వతంత్రులు 8 చోట్ల విజయం సాధించారు. గిద్దలూరులో బీఎస్పీ, చీరాలలో అత్యధికంగా స్వతంత్రులు, మార్కాపురం మున్సిపాలిటీలో సీపీఎం, సీపీఐ సభ్యులున్నారు. - ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ మేరకు.. ఇప్పటికే ఆయా మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులుగా ఉన్న వారే ప్రిసైడింగ్ అధికారులుగా చైర్మన్ ఎన్నికలను నిర్వహిస్తారు. - ఉదయం తొలుత చైర్మన్ అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించిన అనంతరం... కౌన్సిల్‌ను సమావేశపరిచి వార్డుసభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆ తర్వాత చైర్మన్ నామినేషన్లను పరిశీలించి, బహిరంగ ఓటింగ్ పెడతారు. వార్డుసభ్యులు చేతులెత్తి తమ మద్దతును తెలియపరచనున్నారు. - మెజార్టీ మద్దతు లభించిన వారిని చైర్మన్‌గా ప్రకటిస్తారు. అయితే, చైర్మన్ ఎంపికలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్అఫిషియో సభ్యుల హోదాలో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. మెజార్టీకి వార్డుసభ్యుల మద్దతుతో పాటు ఎక్స్అఫిషియో సభ్యుల ఓటింగ్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటారు. చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక తతంగం పూర్తయ్యే నాటికి మధ్యాహ్నం కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మున్సిపల్ పాలకవర్గం ఏర్పడిన 60 రోజుల్లోపు కోఆప్షన్ సభ్యులను కూడా ఎన్నుకొనే అవకాశం ఉంది. మున్సిపాలిటీల వారీగా బలాబలాలివి.. - చీరాల మున్సిపాలిటీలో 33 వార్డులున్నాయి. చైర్మన్ పదవి ఓసీ జనరల్‌కు కేటాయించారు. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ 15 వార్డుల్లో, టీడీపీ 12 చోట్ల గెలుపొందింది. ఆరుగురు స్వతంత్రులు కాగా.. వీరంతా స్థానిక ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గంగా ఉన్నారు. టీడీపీ ఎంపీ పులివర్తి మాల్యాద్రి ఇక్కడ ఓటేసే అవకాశం ఉంది. ఎమ్మెల్యేతో పాటు స్వతంత్రులు వైఎస్సార్సీపీ వైపు మొగ్గుచూపే అవకాశమున్నందున... చైర్మన్ పదవి టీడీపీకి దక్కదనే సంకేతాలున్నాయి. - మార్కాపురం మున్సిపాలిటీలో 32 వార్డులున్నాయి. చైర్మన్ రిజర్వేషన్ ఓసీ మహిళ కాగా, వైస్సార్సీపీ 10, టీడీపీ 19 స్థానాల్లో గెలిచింది. సీపీఐ ఒకటి, సీపీఎం ఒకటి గెలుచుకోగా.. ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. టీడీపీ బలం 22 కనిపిస్తోండగా.. ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ వైఎస్సార్సీపీకి చెందిన వారైనందున ఆ పార్టీకి రెండు ఓట్లు పడనున్నాయి. అయితే, ఇక్కడ టీడీపీ వైస్‌చైర్మన్‌గా ముస్లిం సామాజికవర్గానికి చెందిన వారిని నియమిస్తామని గతంలో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న కందుల నారాయణరెడ్డి ప్రకటించారు. తాజాగా, ఆయన మాట మార్చడంతో టీడీపీలో వర్గవిభేదాలు బహిర్గతమయ్యాయి. ఈనేపథ్యంలో కొందరు టీడీపీ సభ్యులు వైఎస్సార్సీపీకి బలానివ్వచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. - చీమకుర్తిలో 20 వార్డులుండగా, చైర్మన్ పదవి బీసీ జనరల్‌కు కేటాయించారు. వైఎస్సార్సీపీ 8చోట్ల, టీడీపీ 12 చోట్ల గెలుపొందింది. అయితే, టీడీపీ అభ్యర్థి ఒకరు బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. స్థానిక ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ కాగా.. ఎంపీ టీడీపీ వైపు ఉన్నారు. ఇక్కడ చైర్మన్ ఎంపిక ఉత్కంఠగా జరగవచ్చని అధికారులు చెబుతున్నారు. - కనిగిరిలో 20 వార్డులుండగా, చైర్మన్ పదవి బీసీ జనరల్ అయ్యింది. వైఎస్సార్సీపీ 8 స్థానాల్లో, టీడీపీ 11 చోట్ల గెలుపొందింది. ఒకరు స్వతంత్ర అభ్యర్థి. ఎమ్మెల్యే టీడీపీ కాగా.. ఎంపీ వైఎస్సార్సీపీ వైపు ఉన్నారు. - అద్దంకిలో 20 వార్డులుండగా, ఎస్సీ మహిళకు చైర్మన్ పదవి రిజర్వుఅయ్యింది. ఇక్కడ 15 స్థానాల్లో టీడీపీ ఆధిక్యత చూపగా, వైఎస్సార్సీపీ మాత్రం 5 స్థానాల్లోనే గెలిచింది. ఇక్కడ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉండగా.. ఎంపీ టీడీపీ తరఫున ఉన్నారు. - గిద్దలూరులో 20 వార్డులుండగా, 11 స్థానాల్లో వైఎస్సార్సీపీ గెలుపొందగా,.. టీడీపీ ఒక్క వార్డునూ కైవసం చేసుకోలేకపోయింది. మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వర్గంగా బీఎస్పీ తరఫున 9 మంది వార్డు సభ్యులుగా గెలిచారు. ఇక్కడ ఎమ్మెల్యేతో పాటు ఎంపీ కూడా వైఎస్సార్సీపీనే కావడంతో చైర్మన్ పదవి వైఎస్సార్సీపీకే దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. -
నేడే పంచాయతీ సమరం
కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో వాయిదా పడ్డ సర్పంచ్, వార్డు సభ్యుల స్థ్థానాలకు శనివారం మలివిడత ఎన్నికలు జరగనున్నాయి. ఏడు సర్పంచ్, 151 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు గత నెలలో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 7వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరిగింది. పదో తేదీన ఉపసంహరణ నిర్వహించారు. దండేపల్లి మండలం తాళ్లపేటలోని 2వ వార్డుకు, రెబ్బెన మండలం కొండపల్లిలోని 7వ వార్డుకు, తాండూర్ మండలం అచ్చలాపూర్‌లోని 2వ వార్డు కు, బెజ్జూర్ మండలం సోమినిలోని 9వ వార్డుకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతోపాటు కాగజ్‌నగర్ మండలంలోని నజ్రూల్‌నగర్ సర్పంచ్ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా, ఆరు సర్పంచ్ స్థానాలైన తాం సి మండలంలోని వడ్డాడి, బండల్‌నాగాపూర్, కాగజ్‌నగర్ మండలం చింతగూ డ, తలమడుగు మండలం రుయ్యాడి, దండేపల్లి మండలం గూడేం, బేల మం డలం కొబ్బాయి గ్రామ సర్పంచ్ స్థానంతోపాటు 56 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు రాక ఎన్నికలు నిర్వహించ డం లేదు. సోమినిలో ముగ్గురు, అచ్చలాపూర్‌లో నలుగురు, తాళ్లపేటలో ము గ్గురు, కొండపల్లిలో ముగ్గురు చొప్పున 13 మంది బరిలో ఉన్నారు. కాగా, కాగజ్‌నగర్ మండలం నజ్రూల్‌నగర్ సర్పంచ్ స్థానానికి జరుగనున్న ఎన్నికలకు సంబంధించి 16 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ముగ్గురు చొప్పున 46మంది సిబ్బందిని నియమించారు. కాగా, నాలుగు వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఒక్కో వార్డుకు ఇద్దరు అధికారుల చొప్పున ఎనిమిది మందిని నియమించారు. దీంతోపాటు సర్పంచ్ స్థానానికి జరుగనున్న ఎన్నికలకు సంబంధించి నలుగురు పోలీస్ అధికారులను నియమించారు. ఎన్నికలకు మొత్తం 60 మంది సిబ్బందిని నియమించారు. -
సొంతూరి కోసం రాజకీయాల్లోకి..
మెదక్ రూరల్, న్యూస్‌లైన్: ఉన్నత విద్యావంతులైన ఓ ఇద్దరు యువకులు తమ కెరీర్‌ను వదులుకుని రాజకీయ రంగప్రవేశం చేశారు. ఉద్యోగాలు చేస్తే తాము, తమ కుటుంబమే బాగుపడుతుందని.. అదే రాజకీయాల్లోకి వచ్చి ప్రజాప్రతినిధి అయితే గ్రామాన్నే బాగుపరచవచ్చంటున్నారు మెదక్ మండలానికి చెందిన ఈ యువకులు. ఇలా వారు వచ్చిరాగానే ఉపసర్పంచ్‌లుగా పదవులను అందిపుచ్చుకున్నారు. మెదక్ మండలం మారుమూల గ్రామమైన కొత్తపల్లికి చెందిన చిరంజీవిరెడ్డి నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో బీటెక్ పూర్తి చేశారు. ఆ తరువాత హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలోగల ఎక్నోలైట్ అనే ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. నెలకు రూ.20 వేల వేతనం. అందులో ఎనిమిది నెలలు పనిచేశారు. అంతలోనే పంచాయతీ ఎన్నికలు రావడంతో పుట్టిపెరిగిన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఉద్యోగాన్ని వదిలి ఇంటికి చేరుకున్నారు. సర్పంచ్‌గా పోటీచేసేందుకు రిజర్వేషన్ అనుకూలించకపోవడంతో వార్డు మెంబర్‌గా పోటీ చేసి గెలుపొందారు. అంతలోనే ఉప సర్పంచ్ పదవి కూడా ఇతణ్ణి వరించింది. వాడి ఉపసర్పంచ్‌గా.. మండలంలోని వాడి గ్రామానికి చెందిన యామిరెడ్డి బీఏ, బీపీఈడీ పూర్తిచేశారు. ఉద్యోగం కోసం వెతుకోవాల్సింది పోయి రాజకీయాల్లోకి వచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాగానే గ్రామానికి చేరుకున్నారు. యామిరెడ్డికి సైతం రిజర్వేషన్ అనుకూలించక పోవడంతో గ్రామంలోని 5వ వార్డుసభ్యుడిగా పోటీ చేసి నెగ్గారు. ఆ వెంటనే ఉప సర్పంచ్ పదవిని దక్కించుకున్నారు. స్థానికంగా అందుబాటులో ఉంటూ గ్రామస్థుల సమస్యలు తెలుసుకుంటూ వీలైనంత వరకు పరిష్కరిస్తున్నట్టు వారు చెబుతున్నారు. -
అలుపెరగని పోరు
సాక్షి, కడప: ఉద్యమం కొత్త పుంతలు తొక్కుతోంది. స్వచ్ఛందంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఉద్యమంలో పూర్తి స్థాయిలో భాగస్వాములవుతున్నారు. 61 రోజులుగా సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నప్పటికీ ఇప్పుడు ఉద్యమం ఎక్కడికి చేరాలో అక్కడికి చేరింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలపై ప్రభావం చూపే సర్పంచులు, వార్డు మెంబర్లు దీక్షలు చేసి సమైక్య తీర్మానాలు ఆమోదించి సమైక్య నినాదాన్ని ఢిల్లీకి బలంగా వినిపించారు. ఆ ఉద్యమ స్ఫూర్తితో కడపలో డీసీసీ బ్యాంకు ఎదుట సహకార సంఘాల అధ్యక్షులు, డెరైక్టర్లు, మహిళలు, మహిళా సంఘాలు, కుల సంఘాలు ఇలా అందరూ ఒక్కతాటిపై చేరి సామూహిక దీక్షలు చేపట్టి సమైక్య శంఖారావాన్ని పూరించారు. కడప నగరంలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు, మున్సిపల్ కార్పొరేషన్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, వాణిజ్యపన్నులశాఖ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. డీసీసీ బ్యాంకు ఎదుట చేపట్టిన సహకార సమరం సామూహిక దీక్షలకు జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది తరలి రావడంతో దీక్షలు విజయవంతమయ్యాయి. డీసీసీబీ చైర్మన్ తిరుపాల్‌రెడ్డి, జీఎం సహదేవరెడ్డి, సహకార అధికారి చంద్రశేఖర్, సహకార కళాశాల ప్రిన్సిపాల్ గుర్రప్పతోపాటు సహకార సిబ్బంది, అధికారులు కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. జమ్మలమడుగులో తెలుగు పండితులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ముద్దనూరు పాత బస్టాండులో యుద్ధభేరి సభను నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు తరలి రావడం విశేషం. సభాప్రాంగణం సమైక్య నినాదాలతో హోరెత్తింది. ఈ సభకు ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, ఆర్డీఓ రఘునాథరెడ్డిలు తమ సంఘీభావాన్ని తెలిపారు. పులివెందులలో ఎన్జీఓలు, మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు ర్యాలీ చేపట్టి మానవహారంగా ఏర్పడ్డారు. రిలే దీక్షల్లో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. రాజంపేటలో వెంకటాంపల్లె, వరదాయపల్లెకు చెందిన గ్రామస్తులు వైఎస్సార్ సీపీ నేతలు కాలయ్యనాయుడు, సోమయ్యనాయుడు ఆధ్వర్యంలో 60 మంది రిలే దీక్షల్లో కూర్చున్నారు. వీరికి ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి సంఘీభావం తెలిపారు. ప్రొద్దుటూరులో నాగాయ్యపల్లెకు చెందిన వైఎస్సార్సీపీ నేత షరీఫ్ ఆధ్వర్యంలో 16 మంది మహిళలు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. అటవీశాఖ సిబ్బంది, ఉద్యోగులు, న్యాయవాదులు, వైద్యులు, మున్సిపల్ సిబ్బంది, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. బద్వేలులో రాష్ట్రం విడిపోతే ఎడారే....కలిసుంటే హరితాంధ్రప్రదేశ్ అంటూ ఉపాధ్యాయులు ఆంధ్రప్రదేశ్ పటాన్ని రోడ్డుపై వేసి ప్రదర్శన నిర్వహించారు. ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. పోరుమామిళ్లలో ముసల్‌రెడ్డిపల్లెకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు 16 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. రైల్వేకోడూరులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనకారులు రోడ్డుపై నిలబడి నిరసన తెలిపారు. వీరికి రాజకీయ జేఏసీ, ఉద్యోగ జేఏసీ, ఆర్యవైశ్య సంఘం తమ మద్దతును తెలిపాయి. ఉపాధ్యాయులు బైకులతో మానవహారం ఏర్పాటు చేశారు. పట్టణంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. చింతంనగర్కు చెందిన పిల్లలు పట్టణంలో సోనియా దిష్టిబొమ్మను ఊరేగిస్తూ నిరసన వ్యక్తం చేశారు. మైదుకూరులో పూల అంగళ్ల యజమానులు, టీ హోటళ్ల వారు పట్టణంలో ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. విచిత్ర వేషధారణలు, చక్కభజనలతో సమైక్య నినాదాన్ని హోరెత్తించారు. రాయచోటి పట్టణంలో జేఏసీ, న్యాయవాదుల రిలే దీక్షలు కొనసాగాయి. ఆర్టీసీ కార్మికులు గొడుగులు చేతబట్టి వినూత్న నిరసన వ్యక్తం చేశారు. -
నేడు వాయిదా పడ్డ పంచాయతీల్లో పోలింగ్
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : వర్షాలు, వరదల కారణంగా రెండో విడతలో వాయిదా పడిన గ్రామ పంచాయతీలకు మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. 13 మండలాల్లోని 25 గ్రామ పంచాయతీలకు, 258 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు ఉంటాయి. అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ జరుగుతుంది. ఇందుకోసం 491 మంది పోలింగ్ అధికారులను ఏర్పాటు చేశామని జిల్లా పంచాయతీ అధికారి పోచయ్య తెలిపారు. ప్రశాంతంగా పోలింగ్ జరగడానికి ఎస్పీ సర్వశ్రేష్టత్రిపాఠి ఆధ్వర్యంలో గట్టి బందోబస్తుతోపాటు పారామిలిటరీ బలగాలు ఏర్పాటు చేశారు. ఓటర్లు భయం లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవచ్చని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఎన్నికలు జరిగే పంచాయతీలు ఇవే.. బేల మండలం సాంగ్వి(జి), బోథ్ మండలం బాబేర, కరత్వాడ, బజార్హత్నూర్ మండలం గిర్నూర్, ఆదిలాబాద్ మండలం యాపల్‌గూడ, వేమనపల్లి మండలం చాంద్‌పెల్లి, దస్నాపూర్, సిర్పూర్(టి) మండలం డబ్బా, కౌటాల మండలం బాబ సాగర్, గుడ్లబోరి, గంగాపూర్, బెజ్జూర్ మండలం దిందా, కృష్ణపెల్లి, పాపన్‌పేట, ఊట్ సారంగపల్లి, కాగజ్‌నగర్ మండలం బారేగూడ, మాలిని, పోతపల్లి, వంజెరి, ఆసిఫాబాద్ మండలం మొవాడ్, నార్నూర్ మండలం గాదిగూడ, పర్సువాడ, వాంకిడి మండలం కన్నెరగామ్, తిర్యాణి మండలం మంగి గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరుగుతాయి.