
కుప్పం: కుప్పం మునిసిపాలిటీ 14వ వార్డుకు నామినేషన్లు వేసిన ఇద్దరిని టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారని వారి బంధువులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్‌టీఆర్ కాలనీకి చెందిన ప్రకాష్, అతడి భార్య తిరుమగన్ 14వ వార్డుకు నామినేషన్లు దాఖలు చేశారు. అప్పటి నుంచి దంపతులతోపాటు వారి ఇద్దరు పిల్లలు కూడా కనిపించడంలేదు. దీనిపై ప్రకాష్ అన్న గోవిందరాజులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్, పీఎస్ మునిరత్నం, మాజీ సర్పంచ్ వెంకటేష్ తన తమ్ముడి కుటుంబాన్ని కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. మాజీ మంత్రి, చంద్రబాబు కార్యదర్శులపై ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment