కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో వాయిదా పడ్డ సర్పంచ్, వార్డు సభ్యుల స్థ్థానాలకు శనివారం మలివిడత ఎన్నికలు జరగనున్నాయి. ఏడు సర్పంచ్, 151 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు గత నెలలో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 7వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరిగింది. పదో తేదీన ఉపసంహరణ నిర్వహించారు. దండేపల్లి మండలం తాళ్లపేటలోని 2వ వార్డుకు, రెబ్బెన మండలం కొండపల్లిలోని 7వ వార్డుకు, తాండూర్ మండలం అచ్చలాపూర్‌లోని 2వ వార్డు కు, బెజ్జూర్ మండలం సోమినిలోని 9వ వార్డుకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతోపాటు కాగజ్‌నగర్ మండలంలోని నజ్రూల్‌నగర్ సర్పంచ్ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా, ఆరు సర్పంచ్ స్థానాలైన తాం సి మండలంలోని వడ్డాడి, బండల్‌నాగాపూర్, కాగజ్‌నగర్ మండలం చింతగూ డ, తలమడుగు మండలం రుయ్యాడి, దండేపల్లి మండలం గూడేం, బేల మం డలం కొబ్బాయి గ్రామ సర్పంచ్ స్థానంతోపాటు 56 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు రాక ఎన్నికలు నిర్వహించ డం లేదు.
సోమినిలో ముగ్గురు, అచ్చలాపూర్‌లో నలుగురు, తాళ్లపేటలో ము గ్గురు, కొండపల్లిలో ముగ్గురు చొప్పున 13 మంది బరిలో ఉన్నారు. కాగా, కాగజ్‌నగర్ మండలం నజ్రూల్‌నగర్ సర్పంచ్ స్థానానికి జరుగనున్న ఎన్నికలకు సంబంధించి 16 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ముగ్గురు చొప్పున 46మంది సిబ్బందిని నియమించారు. కాగా, నాలుగు వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఒక్కో వార్డుకు ఇద్దరు అధికారుల చొప్పున ఎనిమిది మందిని నియమించారు. దీంతోపాటు సర్పంచ్ స్థానానికి జరుగనున్న ఎన్నికలకు సంబంధించి నలుగురు పోలీస్ అధికారులను నియమించారు. ఎన్నికలకు మొత్తం 60 మంది సిబ్బందిని నియమించారు.
నేడే పంచాయతీ సమరం
Published Sat, Jan 18 2014 2:30 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement