కలెక్టరేట్, న్యూస్‌లైన్ : వర్షాలు, వరదల కారణంగా రెండో విడతలో వాయిదా పడిన గ్రామ పంచాయతీలకు మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. 13 మండలాల్లోని 25 గ్రామ పంచాయతీలకు, 258 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు ఉంటాయి. అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ జరుగుతుంది. ఇందుకోసం 491 మంది పోలింగ్ అధికారులను ఏర్పాటు చేశామని జిల్లా పంచాయతీ అధికారి పోచయ్య తెలిపారు. ప్రశాంతంగా పోలింగ్ జరగడానికి ఎస్పీ సర్వశ్రేష్టత్రిపాఠి ఆధ్వర్యంలో గట్టి బందోబస్తుతోపాటు పారామిలిటరీ బలగాలు ఏర్పాటు చేశారు. ఓటర్లు భయం లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవచ్చని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
ఎన్నికలు జరిగే పంచాయతీలు ఇవే..
బేల మండలం సాంగ్వి(జి), బోథ్ మండలం బాబేర, కరత్వాడ, బజార్‌హత్నూర్ మండలం గిర్నూర్, ఆదిలాబాద్ మండలం యాపల్‌గూడ, వేమనపల్లి మండలం చాంద్‌పెల్లి, దస్నాపూర్, సిర్పూర్(టి) మండలం డబ్బా, కౌటాల మండలం బాబ సాగర్, గుడ్లబోరి, గంగాపూర్, బెజ్జూర్ మండలం దిందా, కృష్ణపెల్లి, పాపన్‌పేట, ఊట్ సారంగపల్లి, కాగజ్‌నగర్ మండలం బారేగూడ, మాలిని, పోతపల్లి, వంజెరి, ఆసిఫాబాద్ మండలం మొవాడ్, నార్నూర్ మండలం గాదిగూడ, పర్సువాడ, వాంకిడి మండలం కన్నెరగామ్, తిర్యాణి మండలం మంగి గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరుగుతాయి.
నేడు వాయిదా పడ్డ పంచాయతీల్లో పోలింగ్
Published Tue, Aug 13 2013 3:44 AM | Last Updated on Fri, Sep 1 2017 9:48 PM
Advertisement
Advertisement