స్థానిక పంచాయుతీ కార్యాలయంలో సోవువారం నిర్వహించిన జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి పట్టణంలోని ఆరుగురు
జన్మభూమికి ఆరుగురు ఎంపీటీసీ సభ్యుల గైర్హాజరు
పంచాయతీ పాలకవర్గం గౌరవించలేదని నిరసన
కుప్పం: స్థానిక పంచాయుతీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి పట్టణంలోని ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు (టీడీపీ) గైర్హాజరయ్యారు. పంచాయతీ పాలకవర్గం తమను గౌరవించడం లేదని వారు అలిగినట్లు సమాచారం. కుప్పం గ్రామ పంచాయితీలో 20 మంది వార్డు సభ్యులు, ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. జన్యభూమి కమిటీల్లో ఎంపీటీసీ సభ్యులు కూడా కీలక పాత్ర వహిస్తున్నారు. అయితే పంచాయితీ పాలకవర్గం వద్ద తమకు గౌరవ మర్యాదలు లేవని, పంచాయితీలో తగిన స్థానం కల్పించలేదని ఎంపీటీసీ సభ్యులు తరచూ ఆరోపిస్తూ వస్తున్నారు.
ఈ క్రమంలో ఆదివారం జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో కూడా తమను కించపరిచే విధంగా పంచాయతీ పాలకవర్గ సభ్యులు వ్యవహరించారని, గౌరవం ఇవ్వలేదని సర్పంచ్, అధికారులపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ ఎంపీటీసీ సభ్యులు అక్కడి నుంచి వెనుతిరిగారు. తాము గెలిచినప్పటి నుంచి పంచాయుతీ కార్యాలయుంలో తవును గౌరవించడం లేదని ఎంపీటీసీ సభ్యుల్లో నలుగురు రాజీనావూ చేస్తున్నట్లు టీడీపీ ఇన్‌చార్జి పీ ఎస్ వుునిరత్నానికి రాతపూర్వక లేఖలు అందజేశారు. సోవువారం జన్మభూమి కార్యక్రమంలో జరిగిన రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రవూనికి పలువురు పార్టీ నేతలు ఎంపీటీసీ సభ్యులను ఆహ్వానించినా వారు హాజరుకాలేదు. ఈ పట్టణంలో తీవ్ర చర్చనీయూంశంగా వూరింది.